Home > సినిమా > Kangana Ranaut : ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చేయను.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

Kangana Ranaut : ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చేయను.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

Kangana Ranaut  : ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చేయను.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
X

అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రటీలు డాన్సులు చేయడంపై నటి కంగనా రనౌత్ సెటైర్లు వేశారు. తనకు ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి పదర్శలు చేయనని ఇన్‌స్టా వేదికగా చెప్పారు. ప్రముఖ సింగర్ లత మంగేష్కర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొన్నప్పటికీ పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్మన ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. నేను అంతే డబ్బు కంటే గౌరవం ముఖ్యం అని బలంగా నమ్ముతా అని కంగానా తెలిపారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీకి దాదాపు బాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు.





బాలీవుడ్ తారలు హాజరుకావడమే కాకుండా డ్యాన్స్ చేసి సందడి చేశారు. అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు దాదాపు అందరూ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ పార్టీలో అమితాబ్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే ఈ పార్టీలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎక్కడా కనిపించలేదు. ఆమెను పిలవలేదా..? లేక ఆమే వెళ్లలేదా..? అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. నా లైఫ్‌లో చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదర్కొన్నాని కానీ నేనెప్పుడూ మ్యారేజ్‌లో డ్యాన్స్ చేయలేదు. ప్రముఖ ఐటమ్ సాంగ్స్‌కు చాల అవకాశలు వచ్చాయని వాటిని సున్నితంగా తిరస్కరించాను అని ఆమె తెలిపారు. ఇప్పుడు కంగనా రనౌత్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంగనా రనౌత్ మాట్లాడేది కరెక్ట్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కాగా దాదాపు బాలీవుడ్ నటులందరూ అంబానీ పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి




Updated : 6 March 2024 10:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top