కాంతార ప్రీక్వెల్ స్టోరీ ఇదే.. ఆ మూడే హైలైట్..
X
కన్నడలో చిన్న సినిమాగా విడుదలైన కాంతార , ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలను సృష్టించింది. తెలుగు ఆడియెన్స్‌ని సైతం ఈ మూవీ ఫిదా చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్ రెడీ అవుతుంది . కాంతారా విడుదల చేసేప్పుడే దర్శకుడు రిషబ్ శెట్టి ప్రీక్వెల్ స్టోరీని కూడా రెడీ చేసుకున్నాడు. సాధారణంగా సినిమాల సీక్వెల్స్ తెరకెక్కుతూ ఉంటాయి. కానీ, ప్రీక్వెల్ అనగానే కథ ఎలా ఉంటుంది? ఏం చూపించబోతున్నారు ? అనేది ఆసక్తికరంగా మారింది. శివ తండ్రి దగ్గర నుంచి కథ ప్రారంభమై, అక్కడి నుంచి భూములు ఎలా వచ్చాయి? ఆ తర్వాత జరిగిన పరిణామాల చుట్టూ కథ సాగవచ్చన్న ప్రచారం సాగింది. ఇక కన్నడ చిత్రసీమ నుండి కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని అందుకున్న కాంతార సినిమా ప్రీక్వెల్‌ని అంతకుమించిన స్థాయిలో నిలబెట్టాలని రిషబ్ శెట్టి చూస్తున్నట్టు సమాచారం.
ఎలాంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాంతార. రూ.16కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్‌ని దాదాపు రూ.150 కోట్లతో తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి కాంతార సినిమాలో పెద్దగా స్టార్‌క్యాస్ట్ లేదు. కానీ ప్రీక్వెల్‌లో స్టార్ క్యాస్ట్ ఉండనుంది అని తెలుస్తోంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అందుకే ప్రీక్వెల్ బడ్జెట్ పెరిగిపోతుందని టాక్ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న కాంతార ప్రీక్వెల్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. ఈ క్రమంలో ప్రీక్వెల్ కథ గురించి ఆసక్తికరమైన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. కాంతారా ప్రీక్వెల్ 400 AD కాలంలో జరుగుతుందని అంటున్నారు . రియలిస్టిక్ విలేజ్ థ్రిల్లర్‌గా రూపొందనుందని సమాచారం. ఆ కాలం నాటి మనుషులు ఎలా ఉంటారు , అప్పటి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలని అనేదానిపై రిషబ్ దగ్గరుండి మరీ డిజైన్ చేయిస్తున్నారని టాక్ వినిపిస్తుంది .
ఇక కాంతార షూటింగ్‌ను ఎక్కువ శాతం కుందాపురలో చేయగా.. ఇప్పుడు ప్రీక్వెల్‌ని బెంగుళూర్‌లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకుందట. మొత్తం షూటింగ్‌ను మూడు , నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాంతార ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన పలు సంఘటనలను ఈ ప్రీక్వెల్‌లో చూపనున్నారు. పంజుర్లి దేవతకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే భూతకోల నేపథ్యాన్నిమరింత ఎక్కువగా ప్రేక్షకులకు చూపించనున్నారట . ఇక గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపించనున్నారని ఇప్పటికే ఓ క్లారిటీ కూడా వచ్చింది . గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడు అనేది తెర మీద చూపించనున్నారట.