Home > సినిమా > Karate Kalyani : సూర్యకిరణ్ మరణంపై కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్

Karate Kalyani : సూర్యకిరణ్ మరణంపై కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్

Karate Kalyani :  సూర్యకిరణ్ మరణంపై కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్
X

టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ మరణంపై నటి కరాటే కళ్యాణి కీలక విషయాలు వెల్లడించారు. హీరోయిన్ కల్యాణితో విడాకులు తర్వాత అతడు తాగుడుకు బానిస అయ్యారని చెప్పారు. భార్యతో డైవర్స్ దుస్థతికి కారణమని ఆమె తెలిపారు. హీరోయిన్ కల్యాణి ప్రేమ వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే. భార్యను సూర్యకిరణ్ గుండెల నిండా నింపుకున్నాడని, ఆమె దూరం కావడంతో తట్టుకోలేక పోయాడని కరాటే కల్యాణి అన్నారు. ఈ లోకంలో తనకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిసయ్యాడని చెప్పారు. రాత్రంతా మందు, సిగరెట్లు తాగుతూ ఉండేవాడని, దీంతో ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. తాగుడు వల్లే ఆయనకు జాండిస్ వచ్చిందని.. కామెర్లు కారణంగానే మృతి చెందాడని చెప్పారు. భార్యతో విడిపోయిన తర్వాత ఇక తనకు జీవితంలో ఏమీ మిగలలేదని ఆయన అనుకునే వాడు.. ఈ క్రమంలో ఎక్కువగా మద్యానికి బానిస అయ్యాడు. దీంతో ఆయన లివర్‌ బాగా దెబ్బతింది. ఈ క్రమంలో ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయాడు.

ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినా ఉపయోగం లేకుండా పోయింది. సూర్య కిరణ్‌ నుంచి భార్య విడిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశించాడు. అది ఎప్పటికీ జరగదేమో అనే ఆలోచనలతో రాత్రంతా మద్యం,సిగరెట్స్‌ తాగుతూ గడిపేవాడు. జాండిస్‌ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్‌ మరణించారని కరాటే కళ్యాణి తెలిపారు. టాలీవుడ్‌లో సత్యం, ధన 51, రాజుభాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూర్యకిరణ్‌ 'మాస్టర్‌ సురేష్‌' పేరుతో 200లకు పైగా సినిమాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించాడు. మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్ కూడా. బాల నటుడిగా 200కు పైగా చిత్రాలు చేశాడు. నంది అవార్డులు కూడా అందుకున్నాడు. 1990 వరకు ఆయన నటుడిగా కొనసాగాడు. 2003లో వచ్చిన 'సత్యం' సినిమాతో డైరెక్టర్ గా మారాడు. సుమంత్, జెనీలియా జంటగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. సూర్యకిరణ్‌ టి.ఎస్‌.మణి, రాధాలకు చెన్నైలో జన్మించారు. వీరి స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన సోదరి సుజిత కూడా బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటిగా రాణిస్తున్నారు.




Updated : 12 March 2024 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top