Home > సినిమా > Shobha Shetty : నేను కమిటెడ్ త్వరలోనే పెళ్లి...సీక్రెట్ రివీల్ చేసిన సీరియల్ బ్యూటీ

Shobha Shetty : నేను కమిటెడ్ త్వరలోనే పెళ్లి...సీక్రెట్ రివీల్ చేసిన సీరియల్ బ్యూటీ

Shobha Shetty : నేను కమిటెడ్ త్వరలోనే పెళ్లి...సీక్రెట్ రివీల్ చేసిన సీరియల్ బ్యూటీ
X

కార్తీక దీపం సీరియల్ ఫేమ్ నటి శోభా శెట్టికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ భామ సీరియల్స్‏లో నటిస్తూనే తన ఫ్యాన్స్ తో టచ్‎లో ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ భామ షేర్ చేసే పెట్టే ఫిట్ నెస్ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‎తో పాటు అదృష్టం బాగుండటంతో బిగ్‌బాస్ 7లో ఛాన్స్ కొట్టేసింది. తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటోంది. నామినేషన్ ప్రక్రియలో రెండు సార్లు నామినేట్ అయినా ఎలాగోలాగ హౌస్‎లో నెట్టుకొచ్చింది. ఇక మూడో వారం మాత్రం శోభా శెట్టి నామినేషన్స్‌లో లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శోభా శెట్టికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. తన రిలేషన్, పెళ్లి గురించిన సీక్రెట్‎ను ఈ బ్యూటీ రివీల్ చేసి అందరినీ అవాక్కు చేసింది.





శోభా శెట్టి తన తోటి కంటెస్టెంట్ శుభశ్రీ దగ్గర తన పర్సనల్ రిలేషన్ షిప్ గురించిన విషయాలపై ఓపెన్ అయ్యింది. నీ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పు అని శుభశ్రీ అడగగా శోభా తన పెళ్లి గురించి తెలిపింది. "నేను ఆల్రెడీ కమిటెడ్. నాకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదే నా సీక్రెట్. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. టేస్టీ తేజాకి నిజం తెలియదు" అంటూ శోభా చెప్పింది. ప్రస్తుతం హౌస్‌లో లవ్ ట్రాక్‌లు జోరుగా నడుస్తున్నాయి. రతిక వెనకాల పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ చక్కర్లు కిడుతున్నారు. ఇక టేస్టీ తేజ శోభా చుట్టూనే తిరుగుతున్నాడు. ఆమెకు ఫేవర్‌గా తేజ చాలా చేస్తున్నాడు.




Updated : 20 Sept 2023 10:44 AM IST
Tags:    
Next Story
Share it
Top