Home > సినిమా > టైటానిక్ నటి కేట్ విన్స్‌లెట్ కోటు వేలం...ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

టైటానిక్ నటి కేట్ విన్స్‌లెట్ కోటు వేలం...ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

టైటానిక్ నటి కేట్ విన్స్‌లెట్ కోటు వేలం...ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
X

టైటానిక్ సినిమా ఓ విజువల్ వండర్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 1997లో వచ్చిన ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది.

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను కూడా అందుకుంది.ఈ సినిమాకు సంబంధించిన నటీ, నటులు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా మరోసారి టైటానిక్ నటి కేట్ విన్స్ లెట్ వార్తల్లోకెక్కింది. ఇందుకు ఆమె ధరించిన కోటు వేలంలో కళ్లుతిరిగే ధరకు వెళ్లడమే కారణం.

టైటానిక్ క్లైమెక్స్ సన్నివేశంలో పడవ మునిగిపోతున్నప్పుడు కేట్ విన్స్ లెట్ వేసుకున్న కోటు గుర్తింది కదా.. రోజ్ పాత్రలో జాక్‌గా నటించిన లియోనార్డో డికాప్రియోను విడిపించే సన్నివేశంలో ఈ కోటులో కనిపిస్తుంది. దానిని తాజాగా వేలంగా వేయగా ఊహించని ధర పలుకుతోంది. ఈ కోటు ఏకంగా $100,000 (రూ.8,28,5000) ధర పలికే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కోటు కోసం ఐదురుగు వ్యక్తులు $34,000 (రూ.2,820,553) వేలం పాడారు. భారీగా పోటీ ఉండడంతో నిర్వాహకులు మాత్రం $100,000 కంటే అధికంగానే ధర పలికే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కేట్ విన్స్‌ లెట్ ఐకానిక్ ఓవర్‌ కోటును సెప్టెంబర్ 13, 2023 వరకు గోల్డిన్ ఆక్షన్ హౌస్ ఆధ్వర్యంలో ఆన్‌ లైన్‌లో వేలం కొనసాగనుంది. ఇంకా వేలం పాటకు సుమారు నెల రోజుల పాటు సమయం ఉన్న నేపథ్యంలో ఎంత ధర పలుకుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated : 14 Aug 2023 1:29 PM IST
Tags:    
Next Story
Share it
Top