కీరవాణి కొడుకుతో.. బలగం హీరోయిన్ బైక్ రైడ్
X
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్. ఇందులో బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్గా నటిస్తోంది. వారాహి, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రాబోతున్న ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
సినిమా ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి చీఫ్ గెస్ట్లుగా ఎస్ఎస్ రాజమౌళి, హీరో నాని హాజరయ్యారు. ఈ ఈవెంట్కు హీరో, హీరోయిన్ చేసిన స్టంట్ హైలైట్గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరో తన బైక్ను ఉస్తాద్ అని పిలుచుకుంటాడు. అదే బైక్తో హీరో శ్రీసింహా, హీరోయిన్ కావ్య స్టేజ్పై చక్కర్లు కొట్టి, తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చారు. వాళ్లిద్దరి మధ్య క్లోజ్నెస్ చూసిన ఫ్యాన్స్ గాసిప్స్ అల్లుతున్నారు. సినిమా వరకేనా.. నిజంగానే చక్కర్లు కొట్టారా అంటూ కామెంట్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CvxJDUmvECN/?utm_source=ig_web_copy_link
kavya kalyanram bike ride with keeravani son sri simha
ustad movie, keeravani son movie, srisimha, kavya kalyanram, rajamouli, nani, tollywood news, cinema news, movie news, entertainment, balagam