Home > సినిమా > Keedaa Cola Movie Trailer: తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ ఎలా ఉంది..?

Keedaa Cola Movie Trailer: తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ ఎలా ఉంది..?

Keedaa Cola Movie Trailer: తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ ఎలా ఉంది..?
X

కొందరు దర్శకులకు ఒక శైలి ఉంటుంది. వాళ్లు తీసే సినిమాలు వెంటనే ఆడియన్స్ కు కనెక్ట్ కావు. కొంత టైమ్ పడుతుంది. ఆ తర్వాత మాత్రం అడిక్ట్ అయిపోతారు. అలాంటి దర్శకుల్లో తరుణ్ భాస్కర్ కూడా ఉంటాడు. అతను ఇప్పటి వరకూ చేసింది రెండు సినిమాలే. అయినా తరుణ్ సినిమా అంటే ఒక వర్గం ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఎదురుచూపులు కాస్త ఎక్కువే అయ్యయి. ఒక దశలో అసలు తరుణ్ దర్శకత్వం చేస్తాడా అని కూడా అనుకున్నారు. బట్.. అన్ని సందేహాలను దాటి ఈ సారి కీడా కోలా అనే వెరైటీ టైటిల్ తో వస్తున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన కీడా కోలా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

రెండు సినిమాలతోనే దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు ఓ ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ నగరానికి ఏమైంది సినిమా మొదట్లో థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. కేవలం మూడు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.ఆ తర్వాత డిజిటల్, శాటిలైట్స్ లో అదరగొట్టింది. ఆ మధ్య రీ రిలీజ్ చేస్తే ఏకంగా 8 కోట్లు వచ్చాయి. అయితే దర్శకుడుగా ఈ నగరానికి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.మధ్యలో నటుడుగా, హోస్ట్ గా ఆకట్టుకునే ప్రయత్నాలు చేసినా పూర్తిగా సక్సెస్ కాలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు కీడా కోలా అనే మూవీతో వస్తున్నాడు.

కీడా అంటే కీటకం.. కోలా అంటే డ్రింక్. అంటే సీసాలో పురుగు అనుకోవచ్చు. ఈ పురుగు చుట్టూ తిరిగే కథేమో అనుకున్నారు చాలామంది. బట్ ట్రైలర్ చూస్తే ఓ వెబ్ సిరీస్ కు సరిపోయే కంటెంట్ కనిపిస్తోంది. వైవిధ్యమైన నేపథ్యాల్లో ఉందీ ట్రైలర్. కుర్రాళ్ల కథ, బ్రహ్మానందం ఎపిసోడ్, పొలిటీషియన్స్ స్టోరీ, క్రైమ్ యాంగిల్, పురుగు నేపథ్యం అంటూ చాలా కనిపిస్తున్నాయి. ఒక కథలో ఇన్ని అంశాలను జొప్పిస్తే చూసేవాళ్లు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ తరుణ్ ఈ పాత్రలు వాటి నేపథ్యాలను చాలా సహజంగా తీసుకున్నాడు. ట్రైలర్ లో కనిపించిన చాలా పాత్రలు మనకు నిత్య జీవితంలో కనిపించేవే కావడంతో త్వరగానే కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. బ్రహ్మానందం మరోసారి ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక తరుణ్ భాస్కర్ తను కూడా కీలక పాత్ర చేశాడు. ట్రైలర్ ను బట్టి ఈ సినిమా ఇలా ఉంటుంది అనే అంచనాకు రాలేని విధంగా కట్ చేశారు. నవంబర్ 3న విడుదల కాబోతోన్న కీడాకోలాతో తరుణ్ భాస్కర్ హ్యా్ట్రిక్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Updated : 18 Oct 2023 2:24 PM IST
Tags:    
Next Story
Share it
Top