మురళీ మోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి!
X
రాజకీయ నాయకుల మధ్య కయ్యాలే కాకుండా వియ్యాలు కూడా సాగుతుంటాయి. సినీ పరిశ్రమలో ఇవి మామూలే. పేరు మోసిన కుటుంబాలు తమలాంటి కుటుంబాల్లోనే పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్‌లో అలాంటి ముచ్చట ఒక సాగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కొడుకు, నటుడు శ్రీసింహ ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటుడు, వ్యాపారి మాగంటి మురళీ మోహన్ మనవరాలు రాగతో శ్రీసింహ పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మురళీ మోహన్ కొడుకైన రాంమోహన్, రూప దంపతుల ఏకైక కుమార్తె రాగ. ఆమె ఇటీవై ఐఎస్‌బీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటోంది. ఇక ‘ఉస్తాద్’, ‘మత్తు వదలరా’ చిత్రాలతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ‘మత్తు వదలరా’ చిత్రం ఒక్కే జనాదరణ పొందింది. ప్రస్తుతం బాబయ్ రాజమౌళి సినిమాలకు సాయం చేస్తున్నాడు. రాగ, శ్రీసింహలు తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కుబోతున్నారని వార్తలు వస్తున్నా కీరవాణి, మురళీ మోహన్ కుటుంబాల నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా ఇంతవరకు రాలేదు.