Home > సినిమా > పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించిన కీర్తి సురేష్

పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించిన కీర్తి సురేష్

పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించిన కీర్తి సురేష్
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరైన కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆమె కుటుంబసభ్యులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా ఓ ఆడియో ఫంక్షన్ కు హాజరైన కీర్తి పెళ్లి పుకార్లపై స్పందించింది.

ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన చిత్రం ‘మామన్నన్‌’ లో కీర్తి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న కీర్తికి మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. కీర్తి క్లారిటీ ఇచ్చింది. ‘‘ నా పెళ్లికి సంబంధించిన వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు. నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. నా వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నాక స్వయంగా నేనే ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు.. ప్రతి ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించాల్సిన అవసరం లేదు’’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా 'దసరా' మూవీ తో పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకుంది. దసరా సక్సెస్ తో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'బోలాశంకర్' సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 11 విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు తమిళంలో మామన్నాన్, సైరన్, రివాల్వర్ రీటా, రఘు తథా సినిమాలకు సైన్ చేసిన కీర్తి సురేష్ వాటి షూటింగ్స్తో బిజీగా ఉంది.

Updated : 3 Jun 2023 8:38 PM IST
Tags:    
Next Story
Share it
Top