Home > సినిమా > పుష్ప2 షూటింగ్‌లో కేశవ.. బెయిల్‌పై వచ్చి సీక్రెట్‌గా!

పుష్ప2 షూటింగ్‌లో కేశవ.. బెయిల్‌పై వచ్చి సీక్రెట్‌గా!

పుష్ప2 షూటింగ్‌లో కేశవ.. బెయిల్‌పై వచ్చి సీక్రెట్‌గా!
X

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు పుష్ప2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో పుష్ప మూవీలో అల్లు అర్జున్‌కు ఫ్రెండ్‌గా నటించిన కేశవ పాత్రధారి జగదీష్ అరెస్ట్ అయ్యాడు. తన మాజీ ప్రియురాలి ఆత్మహత్య కేసులో జగదీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పుష్ప2 మూవీ షూటింగ్ ఆగిందని అందరూ చర్చించుకున్నారు. పుష్ప2 షూటింగ్ కూడా ఆగిందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే పుష్ప యూనిట్ జగదీష్‌ను బెయిల్‌పై తీసుకొచ్చి షూటింగ్ చేయాలని భావిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా జగదీష్ బెయిల్‌పై విడుదలై ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కేశవ పాత్రధారి జగదీష్ గతంలో ఓ జూనియర్ ఆర్టిస్టుతో రిలేషన్‌షిప్‌లో ఉండి మరొకరితో కూడా రిలేషన్ పెట్టుకోవడంతో పలుమార్లు గొడవ జరిగింది. ఆ క్రమంలోనే జగదీష్ తన ప్రియురాలిని ఫోటోలు, వీడియాలతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ తర్వాత జగదీష్ వేధింపులు తట్టుకోలేక ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో జగదీష్ తన నేరాన్ని ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు. ఆ ఘటన టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.

జగదీష్ జైలులో ఉండటం వల్ల పుష్ప2 షూటింగ్‌కు అంతరాయం ఏర్పడుతుందని, సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదోననే భయం అభిమానుల్లో కలిగింది. దానిపై పలు కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే జగదీష్ గుట్టుచప్పుడు కాకుండా బెయిల్‌పై బయటకు వచ్చి పుష్ప2 షూటింగ్‌లో జాయిన్ అయినట్లుగా ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. జగదీష్ బెయిల్‌పై వచ్చిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. జగదీష్‌కు సంబంధించిన సీన్లను వెంటనే పూర్తి చేసేందుకు పుష్ప2 యూనిట్ నిర్విరామంగా పనిచేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప2 మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం స్టూడియోలో జరుగుతోంది.

Updated : 28 Jan 2024 3:05 PM IST
Tags:    
Next Story
Share it
Top