Home > సినిమా > షణ్ముఖ్ నన్ను మోసం చేశాడు.. Mouika

షణ్ముఖ్ నన్ను మోసం చేశాడు.. Mouika

షణ్ముఖ్ నన్ను మోసం చేశాడు.. Mouika
X

యూట్యూబ్ స్టార్ షణ్ముక్, సంపత్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్ లో అవకాశం ఇప్పిస్తానని షణ్ముఖ్ తనను మోసం చేశాడని బాధితురాలు మౌనిక తెలిపింది. షణ్ముఖ్ తో పాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్‌పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్‌లోని అతడి ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలో వారి ఇంట్లో గంజాయి దొరకడంతో...అన్నదమ్ములీద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షణ్ముక్ అన్న సంపత్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని మౌనిక అనే యువతి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలు పలు కీలకమైన అంశాలను ఫిర్యాదులో తెలిపింది.

షణ్ముక్ సోదరుడు సంపత్ తనపై పలుమార్లు లైగింక దాడి చేశాడని మౌనిక ఆరోపించింది. హోటల్స్, విల్లాలకు తిసుకెళ్లి తననను బెదిరించి తన పై లైంగిక దాడి చేశాడని చెప్పింది. దీంతో సంపత్ ను పెండ్లి చేసుకోమని బలవంత పెట్టగా..రింగ్ తొడిగి పెండ్లి అయిపోయింది అన్నాడని తెలిపింది. అంతేగాక ఓసారి బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆరోపించింది. అయితే అబార్షన్ విషయం బయటికి చెప్పొదని తనని షణ్ముఖ్ సోదరుడు తనను బెదిరించాడని తెలిపింది. సంపత్ మరో పెండ్లి చేసుకున్నాడని తెలిసి..పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు చెప్పింది. షణ్ముఖ్ దగ్గర గంజాయి, డ్రగ్స్ ఫిల్స్ కూడా ఉన్నాయని ఆరోపించింది. ఓ సారి వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఇద్దరూ గంజాయి తీసుకుంటున్నారని ఫిర్యాదులో యువతి చెప్పింది.

Updated : 22 Feb 2024 8:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top