అంత ఇస్తే ఇంక సినిమా ఏం తీస్తాం-శివ నిర్వాణ
X
ఇతను సినిమాలు సెన్సిబుల్ గా ఉంటాయి. మనుషుల మధ్య సంబంధాలను చాలా సున్నితంగా చూపించడంలో ఎక్స్ పర్ట్. అతనే శివ నిర్వాణ. నిన్నుకోరి, మజిలీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ఖుషి సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమాకు శివ ఇంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ బోలెడు రూమర్స్ వచ్చాయి. దీని మీద ఆయన స్పందించారు.
ఖఉసి సినిమా కోసం శివ నిర్వాణ 12 కోట్లు తీసుకున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. అలాగే విజయ్ దేవరకొండకు 20 కోట్లు, సమంతకు 3 కోట్లు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దీనికి శివ ఏం చెప్పారంటే...ఈ విషయం తనకూ తెలసిందన్నారు. అన్నేసి కోట్లు తీసుకుంటున్నావా అంటూ నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఆటపట్టించారు. మా అమ్మ కూడా నా రెమ్యునరేషన్ విషయం తెలిసి షాక్ అయింది. నిజంగా నీకు అన్ని కోట్లు వస్తున్నాయా అని అడిగింది అని అన్నారు. తరువాత తీరిగ్గా అన్నేసి కోట్లు రెమ్యునరేషన్ ఇస్తే ఇంకా సినిమా తీయడానికి ఏముంటుంది అంటూ రూమర్స్ ను కొట్టిపడేశారు.
ఖుషి సినిమాలో అందరం మనసు పెట్టి పనిచేశాం. విజయ్, సమంతకు కూడా ఈ సినిమా హిట్ అవడం చాలా ముఖ్యం. ఇందులో పాటలన్నీ తానే రాసాను అన్నారు శివ నిర్వాణ. మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్ తో ఒక వైబ్ క్రియేట్ అయింది. అందుకనే ఇది సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇన్ని విషయాలు చెప్పారు, రూమర్స్ ను నిజం కావని కొట్టిపడేశారు కానీ అసలు నిజం మాత్రం చెప్పలేదు. ఖుషి సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో మాత్రం రివీల్ చేయలేదు ఈ సెన్సిబుల్ డైరెక్టర్. అంతేకాదు తన నెక్స్ట్ సినిమాకు కూడా అన్నీ రెడీగా ఉన్నాయని ఖుషి విడుదల అయిన తర్వాత చెబుతా అప్పటివరకు సస్పెన్స్ అని అంటున్నారు.