Kushi movie review : ఖుషి మూవీ రివ్యూ... ఏం మాయ చేశారు!
X
విజయ్ దేవరకొండకు, సమంతకు సవాలుగా మారిన ‘ఖుషి’ ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది! శుక్రవారం దేశ విదేశాల్లో విడుదలైన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విదేశాల్లో గురువారమే ప్రదర్శించడంతో తొలి రివ్యూలు వచ్చేశాయి. సినిమా చూసిన ఎన్నారైలు రౌడీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని, సినిమా అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు. 22 ఏళ్ల కిందట వచ్చిన పవన్ కల్యాణ్ ‘ఖుషి’ పేరుతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి ఎలా ఉంది? విజయ్, అని ‘పిల్ల’ సామ్ ఏం మాయ చేశారో తెలుసుకుందాం...
గాఢమైన ప్రేమ, భక్తి, నాస్తికత్వం, కాపురం, పొరపొచ్చాల దినుసులతో కాశ్మీర్ అందాలు రంగరించి అల్లిన ప్రేమకథ ఇది. నాస్తికుడైన విప్లవ్(విజయ్) బ్రాహ్మణురాలైన ఆరాధ్య (సమంత)తో ప్రేమలో పడతారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు. అనూహ్య పరిస్థితిలో ఆరాధ్య బురఖా వేసుకుని ముస్లింలా మారాల్సి వస్తుంది. విప్లవ్ తండ్రి లెనిస్ సత్యం(సచిన్ ఖడేకర్), ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాసరావు(మురళీ శర్మ)ల పంతాలు పట్టింపుల మధ్య ప్రేమ జంట ఎలా నగిలింది? ఇద్దరి కాపురంలో ఏం జరిగిందన్నది కథ. ఏడాది తిరిగే లోపల తమలాంటి సంతోషమైన జంట మరొకటి లేదని నిరూపిస్తామని సవాల్ చేసిన జంట అకున్నది సాధించిన వైనం ఇది. ఇతివృత్తం సింపుల్‌గా, పాత సినిమా కథలను గుర్తుకు తెచ్చేలా ఉన్నా దర్శకుడు శివ నిర్వాణ అందంగా, మనసును ఆకట్టుకునే విధంగా చెప్పడంతో సినిమా ప్రేక్షకులకు బాగానే ఎక్కుతుంది. కాశ్మీర్ ప్రకృతి అందాలు, శ్రావ్యమైన పాటలు, హీరోహీరోయిన్లు రొమాన్స్ సినిమాకు హైలైట్.
ఎవరెలా చేశారు?
రొమాన్స్ అంటే రెచ్చిపోయే రౌడీ ఈ చిత్రంలో పేరు పెట్టడానికి వీల్లేకుండా జీవించాడు. ప్రేమికుల మధ్య ఉంటే ఈగోలు, చిలిపి తగాదాలు, అనుబంధాలను విజయ్, సుమంత అద్భుతంగా పడించారు. బామ్మగా సీనియర్ లక్ష్మి ఆకట్టుకంటుంది. శరణ్య, రోహిణి, మురళీ శర్మ, సచిన్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ ప్రేమకథా చిత్రాలో రాటుదేలిన శివ నిర్వాణ పకడ్బందీగా స్క్రిప్టు రాసుకుని అనుకున్నది సాధించారు. అయితే కులమతాలను పట్టించుకోకుండా పెళ్లాడి సక్సెస్ అయిన జంట కథలు తెలుగు ప్రేక్షకులకు ఇదివరకు బాగానే తెలిసి ఉండడంతో కొన్ని చోట్ల తెలిసి కథలాగే అనిపిస్తుంది. మాస్ మసాలా అంశాలు లేకపోవడంతో కొందరికి ఫీల్ గుడ్ మూవీని చూశామన్న తృప్తి మాత్రమే మిగులుతుంది. కొన్ని చోట్ల సన్నివేశాలు మరీ బంకలా సాగి విసుగు తెప్పిస్తాయి. చివరి అరంగంట మాత్రం ఉద్వేగంతో మొత్తానికి ‘లైగర్’ పరాజయంతో, ‘శాకుంతలం’ ఫెయిల్యూర్‌తో తడబడుతున్న విజయ్, సమంతలను ఖుషి మళ్లీ బలంగా నిలబెట్టిందనే చెప్పొచ్చు.