kushi movie :విజయ్ ఒళ్ళో సమంత...వాహ్ భలే ఉన్నాది జంట
X
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. సెప్టెంబర్ 1 న ఈ మూవీ విడుదల అవుతోంది. ఇప్పటి వరకు ఇందులో నుంచి మూడు పాటలు రిలీజ్ చేశారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
శివ నిర్వాణ దర్శకత్వంలో మంచి కంప్లీట్ లవ్ స్టోరీగా వస్తున్న సినిమా ఖుషి. వరుస ఫ్లాప్ లతో ఉన్న సమంతకు, లైగర్ డిజాస్టర్ తో ఉన్న విజయ్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. దీనికోసం వీళ్ళు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖుషి నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ వంతు. దీని రిలీజ్ కోసం మూవీ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మూవీకి సంబంధించి ఒక కొత్త పోస్టర్ తో పాటూ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా అందులో ఉంది.
విజయ్ దేవరకొండ కూర్చుని ఉంటే అతని ఒళ్ళో సమంత కూర్చుని ఉంది. విజయ్ చేతిలో సిగరెట్, సమంత చేతిలో పొగలు కక్కే కాఫీతో చాలా చూడ ముచ్చటగా ఉంది పోస్టర్. పెళ్ళైన కొత్తల్లో ఉండే రొమాంటిక్ ఫీలింగ్ ఇందులో కనిపిస్తోంది. దీంతో పాటు ఆగస్టు 9న ట్రైలర్ రిలీజ్ అని ప్రకటించారు.
మైత్రీ మూవీ ముకర్స్ ఖషి సినిమాను నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళాల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఖుషి మూవీ ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.