ప్రెగ్నెన్సీపై సంచలన విషయం బయటపెట్టిన కియారా అద్వానీ
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, పెళ్లైన కొన్నాళ్లకు కియారా పోస్ట్ చేసిన ఫొటోలు చూసి.. బేబీ బంప్ కనిపిస్తోంది, తను ప్రెగ్నెంట్ కావొచ్చని ఊహాగానాలు వచ్చాయి. కియారా కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం కూడా జరిగింది. తర్వాత కొన్ని రోజులకు ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది కియారా. ఈ క్రమంలో 2019లో జరిగిన మూవీ ప్రమోషన్స్ లో కియారా మాట్లాడిన మాటలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రెగ్నెంట్ అయితే.. తనకు నచ్చిన ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటానని చెప్పింది. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాలని, ఎలా ఉన్నా పరవాలేదని తన మనసులో కోరికలను బయటపెట్టింది. తనకు ప్రెగ్నెంట్ కావాలనుందని, దానికోసమే వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో కియారా ఫ్యాన్స్.. తను ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే, కియారా మాత్రం కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తోంది.