Home > సినిమా > మగాడు నెల తప్పడమేంటీ.. మూవీ కోసం వెయిటింగ్ : నాగ్

మగాడు నెల తప్పడమేంటీ.. మూవీ కోసం వెయిటింగ్ : నాగ్

మగాడు నెల తప్పడమేంటీ.. మూవీ కోసం వెయిటింగ్ : నాగ్
X

‘బిగ్ బాస్’ ఫేమ్ సోహైల్ హీరోగా నటించిన మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. అగస్ట్ 18న రిలీజ్ అవుతున్న ఈ మూవీలో రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించాడు.

ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని నాగ్ అన్నారు. ‘‘సోహైల్, రూప అందరూ బాగా యాక్ట్ చేశారు. మగవాడు ప్రెగ్నెంట్ ఎలా అయ్యాడనే క్యూరియాసిటీ ఉంది. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. డైరెక్టర్ శ్రీనివాస్ కష్టమైన సబ్జెక్ట్ను ఎంచుకున్నారు. నిర్మాత అప్పిరెడ్డి మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వడం ఖాయం’’ అని నాగార్జున అన్నారు.

ఈ సందర్భంగా నాగ్ను సోహైల్.. అమల గారి ప్రెగ్నెన్సీ టైంలో మీ ఫీలింగ్ ఏంటి అని అడిగారు. దానికి నాగ్ స్పందిస్తూ.. అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అమల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడ 6నెలలు తన పక్కనే ఉన్నట్లు తెలిపారు. ‘‘షూటింగ్స్ అన్ని పక్కకు పెట్టి.. డెలివరీ వరకు తనతోనే ఉన్నా. డెలివరీ రూంలో కూడా తన చేయి పట్టుకునే ఉన్నా. అదొక చెప్పలేని అనుభూతి, నా జీవితంలో అంతుమించిన అద్భుతమైన మూమెంట్ లేదు’’ అని నాగ్ గుర్తు చేసుకున్నారు.

Updated : 5 Aug 2023 8:12 PM IST
Tags:    
Next Story
Share it
Top