Home > సినిమా > Rules Ranjan Movie Trailer : 'అమ్మ పాలిచ్చి పెంచుద్ది. అయ్య మందిచ్చి ఓదార్చాల'

Rules Ranjan Movie Trailer : 'అమ్మ పాలిచ్చి పెంచుద్ది. అయ్య మందిచ్చి ఓదార్చాల'

Rules Ranjan Movie Trailer : అమ్మ పాలిచ్చి పెంచుద్ది. అయ్య మందిచ్చి ఓదార్చాల
X

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. అతి తక్కువ కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, బాక్సాఫీస్ వద్ద అవి అంతగా హిట్ కొట్టట్లేదు. ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కొత్త సినిమా రూల్స్ రంజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ట్రెండ్ అయ్యాయి. తాజాగా మూవీకి సంబంధించిన ట్రైలర్‍ను కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్.




సుమారు 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న రూల్స్ ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నవ్వించేలా ఉంది. "ప్రతి తండ్రి నన్ను చూసి నేర్చుకోవాల. అమ్మ పాలిచ్చి పెంచుద్ది. అయ్యా మందిచ్చి ఓదార్చాలా. చెప్పు నాన్నా ఏం తాగుతావ్" అంటూ గోపరాజు రమణతో చెప్పించే డైలాగే ఆకట్టుకోగా.. "బీరు ఓకే.." అని అమాయకంగా కిరణ్ అబ్బవరం చెప్పడం మరింత నవ్వించేలా ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా రంజన్‍ను అంతా రూల్స్ రంజన్ అని పిలుస్తారు. అలాంటి వ్యక్తికి గతంలో దూరమైన అమ్మాయి (నేహాశెట్టి) మళ్లీ కలవడంతో రంజన్ జీవితం ఎలా మలుపు తిరిగింది వంటి కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా అంశాలుగా రూల్స్ రంజన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు రత్నం కృష్ణ. గతంలో ఆయన నీ మనసు నాకు తెలుసు, ఆక్సీజన్‌ వంటి సినిమాలు చేశాడు.




Updated : 8 Sept 2023 1:49 PM IST
Tags:    
Next Story
Share it
Top