Home > సినిమా > అది ఆమె ఇష్టం మనం ఏం చేస్తాం...నయన్ పై విశాల్ కామెంట్స్

అది ఆమె ఇష్టం మనం ఏం చేస్తాం...నయన్ పై విశాల్ కామెంట్స్

అది ఆమె ఇష్టం మనం ఏం చేస్తాం...నయన్ పై విశాల్ కామెంట్స్
X

కొంత మంది హీరోయిన్లు సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటారు. మరీ ముఖ్యంగ స్టార్ హీరోయిన్లు ఏం చేసినా చేయకపోయినా సెన్సేషనే అవుతుంది. ఇక తమిళనాట లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమెను నిత్యం మీడియా వంటాడుతూనే ఉంటుంది. పాత్రికేయుల దృష్టి నుంచి ఇలాంటివారు అస్సలు తప్పించుకోలేరు అనేది నిజం. ఇక అసలు మ్యాటర్‎కు వస్తే...హీరో విశాల్‌ తాజాగా నటించిన మూవీ 'మార్క్‌ ఆంటోని'. త్వరలో విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలతో మూవీ యూనిట్ బజీ బిజీగా గడుపుతోంది.

తాజాగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఒక ఈవెంట్‎లో పాల్గొన్న విశాల్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. అసలు నయనతార సినిమాకు సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ ఎందుకు పాల్గొనరంటూ విలేకరి ప్రశ్నించారు. అందుకు విశాల్ బదులిస్తూ అది ఆమె పర్సనల్ మ్యాటర్ అని కూల్‎గా సమాధానం ఇచ్చారు. నయనతార ప్రమోషన్‌లకు రావాలా వద్దా అన్నది పూర్తిగా ఆమె మీదే ఆధారపడ ఉంది. అది ఆమె వ్యక్తిగత హక్కు అని విశాల్ తెలిపారు. ఆమె ప్రమోషన్స్‎లో తప్పనిసరిగా పాల్గొనాలనే రూల్ ఏమీ లేదన్నారు. ఆమెను ఎవరూ నిర్బంధం చేయలేరన్నారు. తనకు ఇష్టం లేకపోతే మనం మాత్రం ఏం చేయగలం. అయితే ఆమె వస్తే మాత్రం బాగుంటుందని చెప్పారు. నిజానికి సినిమా ప్రమోషన్స్‎లో పాల్గొనడం తప్పేమి కాదని విశాల్‌ అన్నారు.

'మార్క్‌ ఆంటోని' ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్‎టైనర్ మూవీ. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‎లో వస్తున్న ఈ సినిమాలో దర్శకుడు సెల్వరాఘవన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మినీ స్టూడియోస్‌ బ్యానర్‎పై వినోద్‌కుమార్‌ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మూవీని వినాయకచవితి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.





Updated : 29 July 2023 11:19 AM IST
Tags:    
Next Story
Share it
Top