NTR Devara: ‘దేవర’ కథను ముగించడం మాతో కాదు.. అందుకే
X
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో డైరెక్టర్ కొరటాల శివ దేవరపై అప్ డేట్ రిలీజ్ చేశాడు. ఈ సినిమా రెండు పార్ట్స్ గా వస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 2024 ఏప్రిల్ 5న తొలి భాగం ప్రేక్షకుల ముందుకు వస్తుందని కన్ఫామ్ చేశాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసి.. సినిమా రెండు పార్ట్స్ గా తీసుకొస్తున్న కారణం ఏంటో చెప్పుకొచ్చాడు.
‘దేవర సినిమా ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇందులో బలమైన పాత్రలు చాలా ఉన్నాయి. ఈ సినిమాను ఎంత ఉత్సాహంగా ప్రారంభించామో.. అదే ఊపుతో ఆ ప్రపంచం రోజు రోజుకు పెద్దదై పోయింది. ఇప్పటివరకు తీసిన సీన్స్, వచ్చిన ఔట్ పుట్ మాలో రెట్టింపు జోష్ ను కలిగించింది. ఎడిటింగ్ చేస్తున్న టైంలో సినిమా నుంచి ఒక్క సీన్, ఒక్క డైలాగ్ ను కూడా తొలగించలేకపోయాం. దాంతో మేమంతా ఉద్వేగానికి గురయ్యాం. అదే టైంలో ఒక సినిమాను పెద్దగా నిర్మించడం కరెక్ట్ కాదు. అలాగని అంతబాగా వచ్చిన సన్నివేశాలను తొలగించడం ఎవరికీ నచ్చలేదు. సినిమాను పూర్తిస్థాయిలో చూపించాలంటే.. రెండు పార్ట్ గా తెరకెక్కించాలి. పాత్రలు, వాటి భావోద్వేగాలు పూర్తిస్థాయిలో చూపిస్తాం’ అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023