Home > సినిమా > ఎన్టీఆర్, ఏఎన్ఆర్‎లే ఆ మాట అనలేదు..నువ్వేంటయ్యా..కోట శ్రీనివాసరావు

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‎లే ఆ మాట అనలేదు..నువ్వేంటయ్యా..కోట శ్రీనివాసరావు

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‎లే ఆ మాట అనలేదు..నువ్వేంటయ్యా..కోట శ్రీనివాసరావు
X

ఇండస్ట్రీలోని కొంత మంది సీనియర్లు నిర్మొహమాటంగా తమ మనసులోని మాటలను సమయం వచ్చినప్పుడల్లా తెలియజేస్తుంటారు. అలాంటి వారిలో కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన మైక పట్టుకుంటే చాలు అందరిలో ఏదో ఒక టెన్షన్ మొదలవుతుంటుంది. ఎవ్వరు ఏమనుకుంటారు అన్నది ఆలోచించకుండా తన అభిప్రాయాలను ఓపెన్‎గా చెబుతుంటారు. ఈ మధ్యనే ఓ కార్యక్రమానికి హాజరైన కోటా శ్రీనివాసరావు స్టార్ హీరోలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి లెజండరీ నటులే తమ రెమ్యునరేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదని కానీ, ఒప్పుడు కొంత మంది నటులు నేను రెండు కోట్లు తీసుకుంటాను అంటూ చెప్పడం ఏంటని ఆయన ఇండైరెక్టుగా పవన్ కల్యాణ్‎ను ప్రశ్నించారు. పవన్ పై కోట చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇదే కార్యక్రమంలో కోట మాట్లాడుతూ.." ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో సినిమా లేదు. అంతా సర్కస్ మాత్రమే కనిపిస్తోంది. సాడ్ సాంగ్స్‎కు కూడా డ్యాన్స్ చేస్తున్నారు.

బాత్ రూమ్‎లో బ్రష్ యాడ్ దగ్గరి నుంచి బంగారు నగల ప్రకటనల వరకు అన్నీ కూడా హీరోలే చేస్తే మరి మిగిలిన నటులు ఏమై పోవాలి? వారు ఎలా బతకాలి? కొంత మంది హీరోలు వారి ఆదాయం చెబుతున్నారు. అప్పటి లెజెండరీ నటులే ఆ విషయాలను ఎప్పుడూ బయటకు చెప్పలేదు" అని కోట ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్య‌లు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించే కోట ఇలా మాట్లాడార‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. ఎందుకంటే కొంత కాలం ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సమావేశంలో తాను రోజుకి రెండు కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాన‌ని చెప్పారు. ఇప్పుడు కోట దానిపైనే మాట్లాడారని అంటున్నారు.

ఈ కామెంట్స్‌పై నెటిజ‌న్స్ కోటాను ట్రోల్ చేస్తున్నారు. అస‌లు ఈయ‌న బాధ ఏంట‌ని అని కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. యాడ్స్‌లో స్టార్ హీరోల కనిపిస్తే వాటి వాల్యూ పెరుగుతుందని , నువ్వు చేస్తే ఎవ‌రు చూస్తారంటూ ఫైర్ అవుతున్నారు.

Updated : 3 Jun 2023 1:26 PM IST
Tags:    
Next Story
Share it
Top