Home > సినిమా > జోజూ జార్జ్ రెండు సినిమాలు రెండు ఫలితాలు

జోజూ జార్జ్ రెండు సినిమాలు రెండు ఫలితాలు

జోజూ జార్జ్ రెండు సినిమాలు రెండు ఫలితాలు
X

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం అనేది స్క్రిప్ట్ మీద సాములాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా రీమేక్ ఎంత సులువు అనుకుంటారో అంతకు మించిన లాస్ అవుతుంది. అందుకే రీమేక్ కదా అని ఈజీగా తీసేయలేం. ముఖ్యంగా మళయాల సినిమాలను రీమేక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేటివిటీ సమస్య అవుతుంది. కొన్నిసార్లు లొకేషన్స్ కూడా మైనస్ అవుతాయి. కొన్నాళ్ల క్రితం మళయాలంలో వచ్చిన జోసెఫ్ అనే సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథనం. సెంటిమెంట్ కూడా ఉండటంతో కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ అనే టైటిల్ తో రీమేక్ చేసింది జీవిత. బట్ తెలుగులో మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేదీ సినిమా. విడుదలకు ముందు ఆసక్తిని పెంచింది. పైగా పోలీస్ పాత్రలు రాజశేఖర్ కు బాగా సూట్ అవుతాయి. జోసెఫ్ హిట్ మూవీ కాబట్టి శేఖర్ కూడా హిట్ అవుతుందనుకున్నారు. కానీ డిజాస్టర్ గా మిగిలిందీ సినిమా.

ఇక తాజాగా అదే జోజూ జార్జ్ కీలక పాత్రలో నటించిన నాయాట్టు అనే మళయాల చిత్రాన్ని శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ‘కోటబొమ్మాళి పిఎస్’ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ సినిమా తెలుగులో పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఒరిజినల్ చూసిన వారిని కూడా ఆకట్టుకుంటోంది. తేజ మార్ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రేసీ స్క్రీన్ ప్లే తో పాటు ఎమోషన్, మెసేజ్ మిక్స్ అయి మెప్పిస్తోంది. మొదటి రోజు రెండు కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించిన కోటబొమ్మాళి మూవీ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ అయ్యేంత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

మొత్తంగా ఒక రీమేక్ ను రూపొందించడం అంత సులువు కాదు అనేందుకు మళయాల హీరో జోజూ జార్జ్ నే నటించిన ఈ రెండు తెలుగు సినిమాలు చెబుతున్నాయి. రాజశేఖర్ దర్శకురాలు జీవిత ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయితే.. శ్రీకాంత్ దర్శకుడు తేజ మార్ని మాత్రం తనదైన శైలిలో మెప్పించాడు.

Updated : 25 Nov 2023 10:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top