Home > సినిమా > సినిమాలకు బైబై..! కొత్త బిజినెస్ మొదలుపెట్టిన కృతి సనన్

సినిమాలకు బైబై..! కొత్త బిజినెస్ మొదలుపెట్టిన కృతి సనన్

సినిమాలకు బైబై..! కొత్త బిజినెస్ మొదలుపెట్టిన కృతి సనన్
X

ఈ తరం నటులు చాలా చురుకుగా ఉన్నారు. కెరీర్ ఏ టైంలో మారుతుందో గ్యారెంటీ లేకపోవడంతో.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. సంపాదిస్తూనే బిజినెస్ ఐడియాస్ తో కెరీర్ ను డెవలప్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇప్పటికే సొంత ప్రొడక్షన్ హౌజ్ బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్ ను మొదలుపెట్టిన కృతి.. ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా మారింది. తన పుట్టిన రోజు (జులై 27) సందర్భంగా సొంతగా స్కిన్ కేర్ బ్రాండ్ ను లాంచ్‌ చేసింది. ప్రముఖ బ్రాండ్ mCaffeine మాతృ సంస్థ PEP టెక్నాలజీస్ భాగస్వామ్యం అయింది. దాంతో తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్‌ను లాంచ్ చేసింది.

ఈ బ్రాండ్ నుంచి రోజువరీ మూడు ముఖ్యమైన ప్రొడక్ట్స్ ను విడుదల చేసింది. అందులో బారియర్ కేర్ క్రీమ్, ఆల్ ఐ నీడ్ సన్ స్క్రీన్ SPF 50 PA++++, గోల్డెర్ అవర్ గ్లో సీరమ్ ఉన్నాయి. దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు సినిమాలకు త్వరలో గుడ్ బై చెప్పబోతోంది అంటే.. మరికొందరు దీపికా పదుకొనె బ్రాండ్ ను కాపీ కొట్టిందని, ట్యాక్స్ ఎగ్గొట్టడానికే ఇలాంటి ఎత్తుగడ వేసినట్లు చెప్తున్నారు. కాగా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ లు బ్యాటీ ప్రొడక్ట్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.


|-| appy Birthday to me! 🥹

Updated : 29 July 2023 11:07 AM IST
Tags:    
Next Story
Share it
Top