ఆదిపురుష్లో అందుకే అవకాశం వచ్చింది : కృతి సనన్
X
ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేస్తున్న ఈ సినిమా రన్ టైం 179 నిమిషాలు. ఈ మూవీ విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీలో తనను సీత పాత్రకు ఎందుకు ఎంపిక చేశారనేదానిపై కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘‘నా హైట్ ఎక్కువగా ఉండటం వల్ల గతంలో చాలా అఫర్లు వచ్చినట్లే వచ్చి, పోయాయి. కానీ ఆదిపురుష్ విషయంలో హైటే నాకు ప్లస్ అయింది. ప్రభాస్ మంచి హైట్ ఉన్న హీరో.. కాబట్టి నేను అయితేనే ఆయన పక్కన సెట్ అవుతానని మేకర్స్ సంప్రదించారు. సీతగా నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆదిపురుష్‌లో ఛాన్స్ రావడం నా అదృష్టం.’’ అని తెలిపింది. మొత్తానికి హైట్ కారణంగానే సీత పాత్ర కోసం తనను ఎంచుకున్నారని కృతి సనన్ చెప్పింది.
మహేష్ బాబు నేనొక్కడినే చిత్రంతో ఈ భామ వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ దూసుకపోతోంది. షెహజాదా, బేడియా, లుకా చుప్పి, హీరోపంటి, రాబ్తా, దోచెయ్, దిల్వాలే వంటి సినిమాల్లో కృతి నటించింది. మరోవైపు ఆదిపురుష్ సినిమా నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే మొత్తం రూ. 250 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. ఓటీటీ హక్కులని భారీ మొత్తంలో చెల్లించి మరీ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అధికారికంగా ఇప్పటికే ఒటీటీ పార్ట్నర్ని కన్ఫర్మ్ చేసింది మూవీ యూనిట్.