ఆ స్టార్ హీరో కొడుకు వేధింపులు.. కృతిశెట్టి ఏమన్నారంటే..?
X
చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతో హిట్ కొట్టి, సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నటి కృతిశెట్టి. ఉప్పెన మూవీతో పరిచయం అయిన కృతి ప్రస్తుతం.. టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీ అయిపోయింది. అయితే, ఇటీవల కృతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ స్టార్ హీరో కొడుకు తనను వేధించాడంటూ ఓ వార్త బయటికి వచ్చింది.
కృతిని ఓ స్టార్ హీరో కొడుకు వేధిస్తున్నట్లు, స్నేహం చేయమని విసిగిస్తున్నట్లు, ఎక్కడికి వెళ్లినా తనతో వెంటరావాలంటూ వేధిస్తుండగా.. ఈ విషయాలన్నీ కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన కృతి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ‘ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి, అసత్య ప్రచారాలు చేయకండి. ఇప్పటి వరకు నాపై వస్తున్న రూమర్స్ ఏవీ పట్టించుకోలేదు. కానీ ఇది రోజురోజుకీ ఎక్కువవుతోంది. కాబట్టి ఇప్పుడు స్పందించక తప్పట్లేదు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మకండి’ అని అభిమానుల్ని కోరింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.