Kumari Aunty Food : కుమారి ఆంటీ స్టోరీతో.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ!.. సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్
X
(Kumari Aunty Food) సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎవరు ఫేమస్ అవుతున్నారు? ఎందుకు ఫేమస్ అవుతున్నారో? తెలియడం లేదు. ఏదో ఒక కంటెంట్ తీసుకుని వీడియోనో, ఫొటోనో తీసి షేర్ చేసి ఫేమస్ అయ్యేవారు ఒకరైతే.. బయట కొంచెం ఏ కొంచెం కొత్తగా జరిగినా దాన్ని కంటెంట్ గా చేసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ఫేమస్ అయ్యేవారు ఇంకొందరు. అలా చాలామంది కామన్ పీపుల్ ఫేమస్ అయ్యారు. వారిపై మీమ్స్ చేసేవారు కొందరైతే.. ట్రోలింగ్ చేసేవారు ఇంకొందరు. ఏదొక ఒక చిన్న మాటతో లేదా వీడియోతో వైరలై ట్రేండింగ్ లోకి రావడం.. ఆ తర్వాత సోషల్ మీడియా కవరేజ్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యిపోవడం జరుగుతుంది. ఇలా వచ్చిన ఫేమ్ తో కొందరికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అలా ఈ మధ్య కాలంలో పాపులర్ అయినవారే కుమారి ఆంటీ అలియాస్ సాయి కుమరి. హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసే సాయి కుమారి.. తాజాగా ఓ వీడియో వైరల్ అయింది.
‘‘మీది మొత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా’’.. అనే డైలాగ్ తో ఆమెను బాగా ట్రోల్ చేశారు. రోడ్ సైడ్ మీల్స్ కు అంత రేటా అంటూ ఆ వీడియోకు కామెంట్స్ రాశారు. అదంతా అటుంచితే.. వీడియో వైరల్ కావడంతో చాలామంది కుమారి ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లడం స్టార్ట్ చేశారు. జనాలు ఎక్కువగా రావడంతో.. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. ట్రాఫిక్ కి అంతరాయం కలగడం, ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ స్టాల్ ని అక్కడి నుంచి తొలిగించాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆమెను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. మీడియా కూడా కుమరి ఆంటీని కవరేజ్ చేసింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజాపాలనలో భాగంగా కుమరి ఆంటీకి మద్దతిచ్చారు. ఆమె ఫుడ్ స్టాల్ ను తరలించొద్దని, అక్కడే కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. మీడియా కవరేజ్, సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో పలు యూట్యూబ్ చానల్స్ కుమారి ఆంటీని ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆమె లైఫ్, పడుతున్న కష్టం, పేదరికం నుంచి ఫుడ్ స్టాల్ పెట్టే స్థాయికి ఎదిగిన విషయాల గురించి కొన్ని ఎపిసోడ్లు చిత్రీకరించాయి. ప్రస్తుతం ఆమె లైఫ్ మామూలుగానే సాగిపోతుంది. ఇంతలో మారోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కుమారి ఆంటీ లైఫ్ స్టోరీపైన ఓ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతుంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, కుమారిపై మరో ఫేక్ వార్త ప్రచారం చేస్తున్నట్లు పలువురు క్లారిటీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ కుమారిపై ఎలాంటి డాక్యుమెంటరీ తీయట్లేదని స్పష్టం చేశారు. కాగా ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. తన స్టోరీని నిజంగానే తెరకెక్కించి స్పూర్తి నింపాలంటున్నారు.