Kumari aunty : వరుస టీవీ షోలతో బిజీ అవుతున్న కుమారి ఆంటీ..మాములుగా లేదుగా!
X
ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ పేరు కుమారి ఆంటీ. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే ఈమె సోషల్ మీడియా పుణ్యమాని సెలెబ్రెటీలా మారిపోయింది. హాయ్ నాన్న, బుజ్జీ అంటూ వచ్చే కస్టమర్లతో తన మాటల ద్వారా ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్ లోని మదాపూర్ వద్ద ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగించే కుమారి ఆంటీ..తన వద్ద వెజ్, నాన్ వెజ్ వంట రేట్స్ తో, కస్టమర్స్ తో ప్రేమగా మాట్లాడే విధానంతో బాగా పేరు సంపాదించింది. సోషల్ మీడియా ద్వారా ఆమె వీడియోలు వైరల్ గా మారాయి. అంతేగాక ఆమె వ్యాపారం చేసే స్థలాన్ని మార్చే విషయంలో..సీఎం రేవంత్ రెడ్డి స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది.
కుమారీ ఆంటీ పాపులర్ కావడంతో టీవీ షోలలోకి వస్తుందని, సినిమా ప్రమోషన్స్ లో వస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టే కుమారి ఆంటీ టీవీ షోలలోకి అడుగు పెట్టింది. ఆల్రెడీ BB ఉత్సవం అనే టీవీ షోలో ఆమె పాల్గొని తన వంటలను రుచి చూపించింది. అయితే తాజాగా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా వచ్చేసింది. షోలో తన ఫుడ్ తీసుకొచ్చి అక్కడున్న వారికి హాయ్ నాన్న ఎలా వున్నారు అంటూ తన స్టైల్లో వడ్డించింది. ఇక స్టేజ్ పైకి ఎవరి పైన అయిన పంచులేసే హైపర్ ఆది, కుమారి ఆంటీతో కూడా సరదాగా జోక్స్ చేశాడు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కుమారీ ఆంటీ క్రేజ్ చూస్తుంటే..మరిన్ని టీవీ షోలు, బిగ్ బాస్ కి కూడా వెళ్లొచ్చని సరదాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.