సమంత కనబడితే విజయ్ ఖుషి..
X
విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన రెండు సాంగ్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ యూట్యూబ్లో ట్రెండింగ్గా మారాయి. ఇక నా రోజా నువ్వే సాంగ్ మణిరత్నం మూవీలను కలిపి రాయగా.. యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ రెండు పాటలను డైరెక్టర శివ నిర్వాణ రాశారు. ఇక ఈ మూవీ నుంచి ఇవాళ టైటిల్ సాంగ్ రిలీజైంది.
ఖుషి..నువ్వు కనబడితే అంటూ సాగే ఈ పాటను కూడా శివ నిర్వాణ రాయగా.. మ్యూజిక్ డైరెక్టర్ హేషాం అబ్దుల్ వహాబ్ పాడారు. ఈ మూవీ సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇక ఈ మూవీలో జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.