Home > సినిమా > నయనతార ఇన్‎స్టాగ్రామ్ ఎంట్రీ అదుర్స్

నయనతార ఇన్‎స్టాగ్రామ్ ఎంట్రీ అదుర్స్

నయనతార ఇన్‎స్టాగ్రామ్ ఎంట్రీ అదుర్స్
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఇన్‎స్టాలో నయన్ భర్త విఘ్నేశ్‌ శివన్‌ అమెకు సంబంధించిన అప్‌డేట్‌లను ఫ్యాన్స్‎తో షేర్ చేసుకునేవారు. ఇకపై నయన్ తన విషయాలను అభిమానులతో పంచుకోబోతున్నారు. నయన్ సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు నయన్‌ ఫస్ట్ పోస్ట్‎తోనే ఆమె నెటిజన్లను అట్రాక్ట్ చేశారు. ఇవాళ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన కవల పిల్లలతో తొలిసారి ఓ వీడియో చేసింది. తాను కథానాయికగా నటించిన ‘జైలర్‌’లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో ఇద్దరు కొడుకులను ఎత్తుకుని మాస్‌ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి అందరి మైండ్ బ్లాక్ చేశారు నయనతార. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు నయన్ ఈ రోజే ఇన్‎స్టాలో ఎంట్రీ ఇచ్చినా, ఫాలోవర్స్ మాత్రం గంట గంటకు పెరుగుతూనే ఉన్నారు. అంట్లుంటది నయనతారతో అంటూ నెటిజన్లు ఆమె వీడియోలకు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

నయనతార అలా ఇన్‎స్టాగ్రామ్‎లో అకౌంట్‌ ఓపెన్‌ చేశారో లేదో వెంటనే లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె పెట్టిన రీల్స్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు. తన పర్సనల్ రీల్‎ను ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా లైక్‌ చేశారు. తన ఇన్‌స్టాలో నయన్ ఐదుగురిని ఫాలో అవుతున్నారు. అందులో తన భర్త విఘ్నేశ్‌, హీరో షారుక్‌ ఖాన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్‌ సంస్థ ‘ది రౌడీ పిక్చర్స్‌’ ఉన్నాయి. తన పర్సనల్ వీడియోతో పాటు నయన్ జవాన్‌ ట్రైలర్‌ను కూడా షేర్ చేశారు. మై ఫేవరేట్ స్టార్ షారుక్‌ ఖాన్‌ తో నా ఫస్ట్ మూవీ ఇది. దీని వెనుక ఎంతో శ్రమ, ప్రేమ ఉన్నాయి. మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ నయన్ రాశారు.


Updated : 31 Aug 2023 3:59 PM IST
Tags:    
Next Story
Share it
Top