Home > సినిమా > ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామి
X

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన మైథ‌లాజిక‌ల్ సినిమా ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ మేకర్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి వేదికగా జూన్ 6వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే ఈ వేడుక కోసం మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు . ఈ ఈవెంట్‎లో పాల్గొనడానికి ముంబై నుండి 200 మంది డ్యాన్సర్లు, ఫేమస్ గాయకులతో పాటు భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ ఈవెంట్‎కు సంబంధించి మరో అప్‎డేట్ వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా యూవీ క్రియేషన్స్ తమ ఫేస్ బుక్‎లో ఈవెంట్ పోస్టర్‎ను షేర్ చేసింది. ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాంగణంలో, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగడం పట్ల మేకర్స్ సంతోషంగా ఉన్నారు.


రామాయ‌ణ గాథ ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్. ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా, సీతగా కృతి సనన్ కనిపిస్తోంది. రావ‌ణాసురుడి పాత్రను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నాడు. రూ.500 కోట్ల బడ్జెట్‎తో, మోష‌న్‌క్యాప్చ‌ర్, త్రీడీ టెక్నాల‌జీతో సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఆదిపురుష్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్ కూడా తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు.

Updated : 5 Jun 2023 10:03 AM IST
Tags:    
Next Story
Share it
Top