Home > సినిమా > 'కాంతార 2' కోసం రిషబ్‌ శెట్టి ఏం చేస్తున్నాడో తెలుసా?

'కాంతార 2' కోసం రిషబ్‌ శెట్టి ఏం చేస్తున్నాడో తెలుసా?

కాంతార 2 కోసం రిషబ్‌ శెట్టి ఏం చేస్తున్నాడో తెలుసా?
X

గత ఏడాది విడుదలైన కాంతార సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్‎ను సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిన్న సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. మూవీ మేకర్స్‎కు లాభాల పంట పండించింది. కథ, డైరెక్షన్, మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఇలా ఒకటేమిటి అన్నీ పర్ఫెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా రిషబ్ షెట్టిని ఎక్కడికో తీసుకెళ్లింది. అంచనాలకు మించి కాంతార హిట్ కావడంతో మేకర్స్ రెండో భాగాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసింది. అయితే కాంతార 2 సినిమాకు సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా రెండో భాగానికి సంబంధించి మరో అప్‎డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాంతారలో రిషబ్ శెట్టి తన యాక్టింగ్‎తో ఇరగదీశాడు. ఓవర్ నైట్‎లో ఇండియన్ స్టార్‎గా మారిపోయాడు రిషబ్. అందకే ప్రీక్వెల్‎లో కూడా తన విశ్వరూపాన్ని చూపించేందుకు తెగ కసరత్తులు చేస్తున్నాడట. ఈ ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం.

ఆగస్టు 27 నుంచి కాంతార 2 షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ పనులు జరుగుతున్నాయి. మొదటి భాగాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన మేకర్స్..రెండో భాగాన్ని మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీక్వెల్‎లో భూతకోల నేపథ్యాన్ని మరింత ఎలివేట్ చేసి చూపించాలనుకుంటున్నారట మేకర్స్. పంజుర్లికి సంబంధించిన సీన్స్ ఈ భాగంగా ఎక్కువగా ఉండనున్నాయి. అందుకే ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదే విధంగా హీరో రిషబ్‌ శెట్టి సెకెండ్ పార్ట్ కోసం గుర్రపు స్వారీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని టాక్‌ జోరుగా వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు కాంతార 2ను తీసుకురావలని మేకర్స్‌ భావిస్తున్నారు.








Updated : 23 Jun 2023 8:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top