Home > సినిమా > మహేష్ ఫ్యాన్స్‎కి రాజమౌళి బ్యాడ్ న్యూస్

మహేష్ ఫ్యాన్స్‎కి రాజమౌళి బ్యాడ్ న్యూస్

మహేష్ ఫ్యాన్స్‎కి రాజమౌళి బ్యాడ్ న్యూస్
X

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మూవీ కథను ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ సినిమా ఇండియానా జోన్స్ త‌ర‌హా అడ్వెంచ‌ర‌స్‎గా ఉండబోతోందని రాజ‌మౌళి ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ఇదే విషయాన్ని రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా పలుమార్లు స్పష్టం చేశారు. మహేష్ బాబు, దర్శకధీరుడితో మొదటి సారి చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఆగస్టులో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటికి అలాంటి అప్‎డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‎లో పడిపోయారు. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి, మహేష్ బాబు సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం ముందుకు సాగడం లేదు. అయితే దీని వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలకు, కీరవాణి జ్యోతిష్యుడుతో సంప్రదింపులు చేసి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేస్తారని టాక్. కర్ణాటకలో ఉండే జ్యోతిష్యుడి మాటను రాజమౌళి కూడా వింటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీరవాణి, రాజమౌళి జాతకాన్ని చూపించగా.. ఆయనకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పారని సమాచారం . ఈ ఏడాది కొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లకూడదని కూడా చెప్పారట. అందుకే రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న ఈ అడ్వెంచరస్ సినిమా పూజను కూడా చేయలేదని అంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఇలాగే ఉంటుందని, ఆగస్టు తరువాత గ్రహాలు అనుకూలిస్తాయని చెప్పడంతో, అప్పుడే మహేష్ తో సినిమా మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు సామజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందో కానీ, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ అవుతోంది. కారణం ఏదైనా సుపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఇంకా పట్టాలు ఎక్కకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు .

Updated : 5 Sept 2023 6:57 PM IST
Tags:    
Next Story
Share it
Top