వచ్చే వారమే లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్
X
మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని.. మరికొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై మెగా ఫ్యామిలీ, వరుణ్ తేజ్ స్పందించలేదు.. కానీ ఒకటి రెండు సార్లు లావణ్య త్రిపాఠి మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు.. మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది..
తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన హీరోయిన్ లావణ్యతో వరుణ్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాతీయ మీడియా పత్రిక .. వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని నివాసంలో లేదా ఓ ఫంక్షన్ హాల్ లో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉంటుందని పేర్కొంది. ఈ వేడుకకు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, సుష్మిత, శ్రీజ సహా కొణిదెల కుటుంబం అంతా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కుటుంబం కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
వీరి ఎంగేజ్మెంట్ అంటూ ప్రముఖ బాలీవుడ్ మీడియా పింక్ విల్లా కథనంలో…జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగనుందని.. ఇందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. వధూవరుల దుస్తులు, ఆభరణాలు ప్రముఖ డిజైనర్స్ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలి అధికారికంగా ప్రకటించలేదు.. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. ఇక ఇందుకు నిజమేంత ఉందో తెలియాలంటే మాత్రమే జూన్ 9 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం అనే సినిమాల్లో నటించారు.