Home > సినిమా > పెళ్లికి ముందే భారీ కండీషన్.. దానికి ఒప్పుకుంటేనే పెళ్లి.. లేదంటే..!

పెళ్లికి ముందే భారీ కండీషన్.. దానికి ఒప్పుకుంటేనే పెళ్లి.. లేదంటే..!

పెళ్లికి ముందే భారీ కండీషన్.. దానికి ఒప్పుకుంటేనే పెళ్లి.. లేదంటే..!
X

ఆరేళ్లుగా సీక్రెట్ గా లవ్ చేసుకుని.. ఈనెల 9న రింగులు మార్చుకుని తమ రిలేషన్ షిప్ ను బయటపెట్టారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై సందడి చేశారు. ప్రస్తుతం వీరి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరు ఎలా కలిసారు..? ఎప్పుడు కలిసారని వెతుకుతున్నారు. అయితే, ఈ ఇద్దరి పెళ్లి ఈ ఏడాది చివర్లో ఇటలీ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. పెళ్లికి ముందే వరుణ్ తేజ్ కు భారీ కండీషన్ పెట్టిందట లావణ్య. ఆ కండీషన్ కు ఒప్పుకుంటేనే పెళ్లి.. లేదంటే మీ ఇష్టం అని చెప్పేసిందట. ఈ వార్తలన్నీ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ కండీషన్స్ ఏంటంటే.. లావణ్యకు భరత నాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తానని.. వేరే ఏదైనా స్టేజిపై చేయాల్సి వచ్చినా వదులుకోనని చెప్పేసిందట. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకపోయినా.. తనకెంతో ఇష్టమైన ప్రొడక్షన్ వైపు వెళ్తానని తేల్చి చెప్పిందట. అయితే, లావణ్య పెట్టిన ఈ కండీషన్స్ అన్నింటికీ మెగా ఫ్యామిలీ ఒప్పుకుందని సమాచారం.

Lavanya Tripathi gave conditions to Varun Tej before marriage

tollywood news, movie news, cinema news, latest news, telugu news, Lavanya Tripathi, Varun Tej, mega family, Lavanya conditions to Varun Tej

Updated : 13 Jun 2023 8:46 PM IST
Tags:    
Next Story
Share it
Top