Home > సినిమా > ‘బ్రో’ టీజర్‌పై మెగా కోడలు ఆసక్తికర ట్వీట్..

‘బ్రో’ టీజర్‌పై మెగా కోడలు ఆసక్తికర ట్వీట్..

‘బ్రో’ టీజర్‌పై మెగా కోడలు ఆసక్తికర ట్వీట్..
X

మామ-అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో విజయాన్ని అందుకున్న ‘వినోదాయ సిథం’కు రీమేక్‌గా ‘బ్రో’ తెరకెక్కింది. మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తోంది.





‘బ్రో’ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్‎ను సొంతం చేసుకుంది. రీసెంట్‎గా ఈ సినిమా 30 మిలియన్ల వ్యూవ్స్ అందుకొని అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ అందుకున్న టాప్ టీజర్స్ లో ఒకటిగా నిలిచింది. బ్రో అంతలా అభిమానులను ఆకట్టుకుంటోంది. కొత్త పాత్రలో పవన్ కనిపించడం అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఇలా ఉంటే మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా బ్రో టీజర్ పై ట్వీట్ చేసింది. ‘‘మీ ఇద్దరిని ఇలా ఒకే స్క్రీన్‌పై చూడటం కన్నుల పండుగలా అనిపిస్తుంది. టీజర్‌ అద్భుతంగా ఉంది’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్ గా మారింది. ‘కొత్త కోడలు ఆన్‌ డ్యూటీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠికి ఈ మధ్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు ప్రస్తుతం పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ ఏడాదిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.





Updated : 1 July 2023 11:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top