Home > సినిమా > Lavanya Tripathi : విశాఖ బీచ్‌లో సందడి చేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi : విశాఖ బీచ్‌లో సందడి చేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi : విశాఖ బీచ్‌లో సందడి చేసిన లావణ్య త్రిపాఠి
X

విశాఖ ఆర్కే బీచ్‌లో మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందడి చేశారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వైఎంసీ దగ్గర బీచ్‌లో వ్యర్థాలను తొలిగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్‌ను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని సూచించారు. మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా కనిపిస్తున్నానన్నారు లావణ్య త్రిపాఠి. వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్ బిగ్‌బాస్ ఫేం అభిజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఫిబ్ర‌వ‌రి 2 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో ఎప్పుడూ పరిశుభ్రత విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే మహిళ లావణ్య రావు అనే పాత్రలో ఆమె కనిపించబోతోంది. శుభ్రత అంటే ప్రాణమిచ్చే లావణ్య.. క్లీన్‍నెస్‍ను ఓ మాత్రం పట్టించుకోని అభిజిత్ అనుకోకుండా ప్రేమ‌లో ప‌డతారు. ఈ నేప‌థ్యంలో ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే అస‌రక్తిక‌ర‌మైన పాయింట్‌తో హ‌స్య భ‌రితంగా ఈ సిరీస్‌ను రూపొందించారు.




Updated : 28 Jan 2024 6:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top