పెళ్లి తర్వాత లైఫ్ ఏం మారలేదు.. కేరీర్పై స్పందించిన లావణ్య త్రిపాఠి
X
సినిమా సెలక్షన్ లో తానెప్పుడూ ఆచితూచి వ్యవహరించానని, ఎక్కువ సినిమాలు చేసేయాలని ఎప్పుడూ ఆరాటపడలేదని మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. డైరెక్టర్ విశ్వక్ ఖండేరావ్ రూపొందించిన.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది లావణ్య. ఈ సందర్భంగ మాట్లాడిన లావణ్య.. తన కెరీర్ పై ఆసక్తిర విషయాలు పంచుకుంది. తన కెరీర్ లో చేసినవి కొన్ని సినిమాలే అయినా.. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయని లావణ్య చెప్పుకొచ్చింది.
‘పెళ్లి తర్వాత నా కెరీర్ పరంగా ఏం మారలేదు. మెగా కోడలయ్యావు కాదా. ఇలానే ఉండాలి, ఈ పనులు చేయాలని నాకెవరూ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. నా కెరీర్ పరంగా కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ తేజా బాగా అర్థం చేసుకుంటాడు. ఒక ఆడపిల్లకు ఇంతకన్నా ఇంకేంకావాలి. నా ప్రాజెక్ట్స్ విషయంలో వరుణ్ పెద్దగా కలుగజేసుకోడు. నేను ఫైనల్ చేసిన స్క్రీప్ట్స్ గురించి చెప్తే వింటాదంతే. మిస్ పర్ఫెక్ట్ సిరీస్ అతనికి బాగా నచ్చింది. నా పర్ఫామెన్స్ ను మెచ్చుకున్నాడ’ని లావణ్య చెప్పుకొచ్చింది.