Prabhas Kalki : కల్కి సెట్స్ నుంచి లీకైన వీడియో..ఫోటోలు వైరల్..
X
టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. మన హీరోలంతా పాన్ ఇండియా రెంజ్ లో వాళ్ల సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. బహుబలితో వచ్చిన క్రేజ్ తో డార్లింగ్ పాన్ ఇండియా రెంజ్ లోనే మూవీస్ చేస్తున్నాడు. తాజాగా సలార్ మూవీతో హిట్ కొట్టిన డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు.
ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను మేలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు మేకర్స్. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా వర్క్స్ పూర్తి చేసుకుంటుంది.
కాగా ఈ మూవీ త్రి పార్ట్స్ గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట. ఇప్పటికే ఈ విడుదల చేసిన కల్కి గ్లింప్స్ తో మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా ఉంటే..ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ వీడియోలో కల్కి మూవీ సెట్స్ కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా ఈ సినిమాలో చాలామంది సూపర్ స్టార్స్ కనబడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
Kalki2898AD Leaked Video And Photos 🥵❤️🔥🙏🏻
— AKLESH (@aklesh__sahni) February 15, 2024
It's Going To next level 🙏🏻🥵🔥🔥
💥#Kalki2898AD
Hollywood we Are coming 🙏🏻🔥❤️🔥@nagashwin7 @Kalki2898AD pic.twitter.com/bny34n7Bq1