Home > సినిమా > వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా : మృణాల్ ఠాకూర్

వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా : మృణాల్ ఠాకూర్

వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా : మృణాల్ ఠాకూర్
X

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అందాల భామ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా ఆడియన్స్ ను మెప్పించి కుర్రాకారును తన వైపు తిప్పుకుంది. ఈ మధ్యే హాయ్ నాన్న చిత్రంతో పలకరించిన మృణాల్ అందరిని తన నటనతో కంటతడి పెట్టించింది. హీరోయిన్ క్యారెక్టర్ కి ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ..తెలుగులో రెండు భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. సీతగా అందరి హృదయాలను దోచుకున్న మృణాల్..ఆ సినిమా తన జీవితంలో ఎన్నో మర్చిపోని జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పారు.

తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..వృత్తిగతంగా రష్మిక, దుల్కర్‌లను స్ఫూర్తిగా తీసుకుంటానంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. సీతారామం తన జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రమని తెలిపింది. ఇందులో తనతో పాటు నటించిన రష్మిక, దుల్కర్‌ సల్మాన్‌ల నుంచి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. రష్మిక పాత్రల ఎంపికలో చాలా ప్రత్యేకంగా ఉంటారన్న ఆమె..ఈ సినిమాలో అఫ్రీన్‌ అనే పాత్ర చేయాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. నిజం చెప్పాలంటే ఈ పాత్రను రష్మిక తప్ప మరెవరూ చేయలేరని తేల్చి చెప్పారు. ఎన్ని గంటలు పని చేసినా ఆమెలో అసలు అలసట కనిపించేది కాదని తెలిపారు. ఇక భాష ఏదైనా మంచి పాత్ర దొరికితే వెంటనే ఒప్పుకోవడం సినిమా పట్ల దుల్కర్‌ కున్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. తన జీవితంలో వీరిద్దరినీ స్ఫూర్తిగా తీసుకొని సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు మృణాల్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం ఇమె విజయ్ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated : 19 Feb 2024 6:25 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top