Home > సినిమా > పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్.. ట్వీట్‌తో గట్టి కౌంటర్!!

పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్.. ట్వీట్‌తో గట్టి కౌంటర్!!

పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్.. ట్వీట్‌తో గట్టి కౌంటర్!!
X

‘పొన్నియిన్ సెల్వన్’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది స్టార్ హీరోయిన్, స్మైలీ బ్యూటీ త్రిష . ప్రజెంట్ ‘లియో’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీగా ఉంది. అయితే నలభై ఏళ్లు వచ్చిన త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్‌తో లవ్‌లో పడిందనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది త్రిష. సదరు నిర్మాతతో తన పెళ్లి వార్తని పూర్తిగా కొట్టి పారేసిన త్రిష.. పుకార్లు వ్యాప్తి చేయడం మానేయాలని కోరింది.

"నువ్వెవరో నీకు తెలుసు. నీ టీమ్ ఏంటో కూడా నీకు తెలుసు. ఇకనైనా నిశ్శబ్దంగా ఉండు, ఇలాంటి పుకార్లు ఆపు. ఛీర్స్" అంటూ పోస్ట్ పెట్టింది త్రిష. తన సందేశంలో ఎక్కడా పెళ్లి, ప్రేమ లాంటి పదాలు ఉపయోగించనప్పటికీ, తన పెళ్లిపై వచ్చినవన్నీ పుకార్లని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పకనే చెప్పింది. సరిగ్గా ఇక్కడే త్రిష పోస్టుపై కొత్త చర్చ మొదలైంది.తను పెళ్లి చేసుకోబోతున్నానంటూ పుకార్లు సృష్టించింది, సోషల్ మీడియాలో వైరల్ చేసింది ఎవరనే విషయం త్రిషకు బాగా తెలుసని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఈ పెళ్లి పుకార్లు త్రిష దృష్టికి వెళ్లగా ఆమె స్పందించారని కొందరు అభిమానులు అభిప్రాయపడగా.. సినిమాల విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్న పీఆర్‌ టీమ్ గురించి ఇలా పరోక్షంగా పోస్ట్‌ పెట్టారంటూ కోలీవుడ్‌ మీడియా పేర్కొంది. ఎవరినుద్దేశించి ఆ కామెంట్‌ చేశారో త్రిషకే తెలియాలని పలువురు నెటిజన్లు అన్నారు.

త్రిష పెళ్లి విషయంలో రూమార్స్‌ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఆమె వివాహం గురించి ఊహాగానాలు వచ్చాయి. ఓ సందర్భంలో వాటిపై స్పందిస్తూ.. అవన్నీ వదంతులంటూ ఖండించారు. ఫోకస్‌ అంతా సినీ కెరీర్‌పైనే ఉందని, ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని త్రిష తెలిపారు.


Updated : 22 Sept 2023 12:05 PM IST
Tags:    
Next Story
Share it
Top