Home > సినిమా > Leo Movie Collections: డివైడ్ టాక్ తోనూ అదరగొడుతున్న లియో

Leo Movie Collections: డివైడ్ టాక్ తోనూ అదరగొడుతున్న లియో

Leo Movie Collections: డివైడ్ టాక్ తోనూ అదరగొడుతున్న లియో
X

కొందరు హీరోలకు కంటెంట్ తో పనిలేకుండా కలెక్షన్స్ వస్తుంటాయి. అది వారి కటౌట్స్ కు ఉండే క్రేజ్. ఈ క్రేజ్ ఉన్న సౌత్ హీరోస్ లో తమిళ్ స్టార్ విజయ్ టాప్ త్రీలో ఉంటాడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో డిజాస్టర్ అయిన వారసుడు తమిళ్ లో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన లియోపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ డిజప్పాయింట్ చేసినా అంచనాలు తగ్గలేదు. మరి అంచనాలున్నాయంటే అందుకు తగ్గ కలెక్షన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా.. ఆ విషయంలో లియో టూ డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ఇళయదళపతిగా తమిళనాట తిరుగులేని పాపులారిటీ ఉన్న హీరో విజయ్. అతని సినిమాలు టాక్, రివ్యూస్ తో పనిలేకుండా వసూళ్లు సాధిస్తుంటాయి. అందుకే రజినీకాంత్ తర్వాత తనే కోలీవుడ్ సూపర్ స్టార్ గా చెప్పుకుంటారు అక్కడి నిర్మాతలు, ఆడియన్స్. విక్రమ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ మరోసారి విజయ్ తో సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు సహజంగానే అంచనాలు పెరిగాయి. అయితే అందుకు తగ్గ కంటెంట్ తో రాలేకపోయాడు లోకేష్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్ గా ఉన్నా.. సెకండ్ హాఫ్ తో తేలిపోయాడు. ముఖ్యంగా ఒక స్టార్ హీరోను ఆ తరహా పాత్రలో చూడటంతో షాక్ అయ్యారు ఫ్యాన్స్. అయినా ఒక పావుగంట సినిమా తప్ప మిగతా అంతా ఆకట్టుకునేలానే రూపొందించాడు లోకేష్.

ఇక లియోపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మొదటి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 148.5 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ ఫిగర్స్ పెద్దగా ఆశ్చర్యపరచలేదు కూడా. ఈ మూవీతో విజయ్ ఇండియా నుంచి మొదటి రోజు వంద కోట్లు సాధించిన హీరోల్లో 8వ వాడుగా చేరాడు. అయితే డివైడ్ టాక్ ప్రభావం రెండో రోజు వసూళ్లపై పడింది. రెండో రోజు ఈ చిత్రం 64.8 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే 213.3 కోట్లు సాధించిందన్నమాట. ఇక స్టార్ హీరో సినిమా కాబట్టి టాక్ తో పనిలేకుండా జనం చూస్తారు. పైగా దసరా హాలిడేస్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీ ఈజీగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఇప్పటికే 3 మిలియన్ క్లబ్ లో చేరింది. ఓవర్శీస్ లో మరిన్ని వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. సో.. డిఫరెంట్ టాక్ వస్తేనే కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటే.. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే ఎన్ని రికార్డులు బద్ధలయ్యేవో అంటున్నారు విశ్లేషకులు.

Updated : 21 Oct 2023 2:48 PM IST
Tags:    
Next Story
Share it
Top