Home > సినిమా > వీకెండ్లో ఓటీటీ మస్తీ.. ఒకే రోజు 18 సినిమాలు, సిరీస్లు

వీకెండ్లో ఓటీటీ మస్తీ.. ఒకే రోజు 18 సినిమాలు, సిరీస్లు

వీకెండ్లో ఓటీటీ మస్తీ.. ఒకే రోజు 18 సినిమాలు, సిరీస్లు
X

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే. వీకెండ్ ను ఎలా ఎంజాయ్ చేయాలని చూస్తున్న వాళ్లకోసం.. ఒకే రోజు 18 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌ కాబోయే సినిమాలేంటంటే..

మధ్య తరగతి కుటుంబ కథ:

రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇంటింటి రామాయణం. ఈ సినిమాను సురేశ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 23 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

కంగనా రనౌత్ నిర్మాతగా:

బాలీవుడ్ డేరింగ్ బ్యూటీ కంగనా రనౌత్ తొలిసారిగా నిర్మాత అవతారం ఎత్తి చిత్రీకరించిన సినిమా టీకూ వెడ్స్ షేరు. నవాజుద్ధీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ ప్రధాన పాత్రలో, సాయి కబీర్ శ్రీవాస్తవ డైరెక్షన్ లో తెరకెక్కింది. సెన్సర్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి రానుంది. జూన్ 23న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్ లో:

క్రైమ్, ఇన్వెస్టిగేషన్ జోనర్ లో తెరకెక్కిన మలయాళ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. లాల్, అజు వర్గీస ముఖ్య పాత్రలో నటించారు. లాడ్జ్ లో జరిగిన హత్యను పోలీసులు ఎలా చేదించారు అనే అంశంపై స్టోరీ ఉంటుంది. జూన్ 23న ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మళ్లీ పెళ్లి ఓటీటీ ఎంట్రీ:

నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన, ఎం.ఎస్. రాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి. నరేష్, పవిత్ర లోకేష్ రియల్ లైఫ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 23న ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో:

జూన్‌ 19న - టేక్‌ కేర్‌ ఆఫ్‌ మాయా (హాలీవుడ్)

జూన్‌ 21న - గ్లామరస్‌ (ఒరిజినల్‌ సిరీస్‌)

జూన్‌ 22న - స్లీపింగ్‌ డాగ్‌ (వెబ్‌సిరీస్‌)

జూన్‌ 22న - సోషల్ కరెన్సీ (హిందీ సిరీస్‌)

జూన్‌ 23న - ఐ నంబర్‌ (హాలీవుడ్‌)

జీ5లో :

జూన్‌ 23న - కిసీకా భాయ్‌ కిసీకీ జాన్‌ (హిందీ)

డిస్నీ+ హాట్ స్టార్ లో :

క్లాస్‌ ఆఫ్‌ 09 (వెబ్‌సిరీస్‌) జూన్‌ 19

సీక్రెట్‌ ఇన్వేషన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 21

ది కేరళ స్టోరీ (హిందీ) జూన్‌ 23

వరల్డ్స్‌ బెస్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌ 23

సోనీలివ్‌ లో:

జూన్‌23న- ఏజెంట్‌ (తెలుగు)

జూన్‌25న - అమెరికన్‌ అండర్‌ డాగ్‌ (ఇంగ్లీష్‌)

లయన్స్‌ గేట్‌ ప్లేలో:

జూన్‌23న- జాన్‌ విక్‌ (హాలీవుడ్‌)

జూన్‌23న- స్లంబర్‌ (హాలీవుడ్‌)

Movies to be released in OTT this week

tollywood news, bollywood news, ott movies, latest released movies, movie news, cinema news, entertainment news, latest news, telugu news

Updated : 22 Jun 2023 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top