పుట్టినరోజునాడు కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
X
మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వర్కింగ్ టైటిల్ SSMB29. ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ పనులు మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రాబోతున్న మహేష్ బాబు పుట్టినరోజు నాడు దీని గురించి బిగ్ అప్డేట్ ను ప్రకటించనున్నారు.
ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకూ లేనివిధంగా నెక్ట్స్ లెవల్లో SSMB29 తెరకెక్కనుందని వినిపిస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు అయిన ఆగస్టు 9న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో మహేష్ బాబును ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రాజమౌళి డిజైన్ చేస్తున్నారుట. తాజా సమాచారం మేరకు.. మహేష్ బాబు పాత్ర హనుమంతుడి నుండి ప్రేరణ పొందిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామాయణం, మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకుని ఫిక్షనల్ పాత్రల కథాంశంతో మహేష్ సినిమాని రాజమౌళి తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.
అమెజాన్ అడవుల్లో సాగే సాహసాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఆంజనేయుడులా అడవిలో అరాచకుల మీద పోరాడే వీరుడిగా మహేష్ కనిపిస్తారని అనుకుంటున్నారు. రామాయణం నుంచి హనుమంతుడి సాహసాలను స్ఫూర్తిగా ఈ పాత్రను డిజైన్ చేస్తున్నారని టాక్. మహేష్ పాత్రను ఫిక్షనలైజ్ చేసి ఒక కొత్త సూపర్ మ్యాన్ ను ఆవిష్కరించనున్నారని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే ఈ సినిమాను భారీగా ఉంటుందని రాజమౌళి తండ్రి, కథా రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. SSMB29 మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మహేష్ ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రమ్ సినిమా తర్వాత మూడు నెలల పాటూ రాజమౌళి వర్క్ షాప్ లో శిక్షణ పొందనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్, థ్రిల్స్ తో ఎమోషనల్ డ్రామా రక్తి కట్టిస్తుందని సమాచారం. ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగా పాన్ వరల్డ్ కంటెంట్ తో తెరకెక్కించడం ద్వారా ప్రపంచంలోని అన్ని మూలల్లో మార్కెట్ పరిధిని విస్తరించేలా రాజమౌళి తెరకెక్కించనున్నారు. పాపులర్ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడానికి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. నటీనటులు సిబ్బంది ఎవరు అన్నది ఇంకా ప్రకటించలేదు.