Home > సినిమా > ప్రశాంత్ వర్మ ఆఫీస్ కు హనుమంతుడు.. వైరల్ అవుతున్న ట్వీట్

ప్రశాంత్ వర్మ ఆఫీస్ కు హనుమంతుడు.. వైరల్ అవుతున్న ట్వీట్

ప్రశాంత్ వర్మ ఆఫీస్ కు హనుమంతుడు.. వైరల్ అవుతున్న ట్వీట్
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తుంది ఒకటే పేరు.. ప్రశాంత్ వర్మ. తీసింది కొన్ని సినిమాలే అయినా.. తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి వచ్చిన తాజా సినిమా హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో సినిమా బాగుందని, హనుమంతున్ని చూపించిన విధానానికి డైరెక్టర్ కు హాట్స్ఆఫ్ చెప్తున్నారు. ఈ ఇంపాక్ట్ తో థియేటర్లన్నీ దేవాలయాల్ని తలపిస్తున్నాయి.

ఆ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది మరి. ఇక సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి తనను హనుమంతుడే నడిపించారని.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఆంజనేయుడే ప్రశాంత్ ఆఫీస్ కు వచ్చాడట. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తన ఆఫీస్ కు వచ్చిన కోతిని ఫొటో తీసి ట్వీట్ చేశాడు. 'చూడండి నా ఆఫీస్ కు హనుమంతుడు అతిథిగా వచ్చార'ని అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక హనుమాన్ సినిమాలో కూడా కోతి ఉంటుంది. కోటి పాత్రలో.. రవితేజ డబ్బింగ్ తో ప్రేక్షకులను అలరించారు.

https://x.com/PrasanthVarma/status/1745770508371611693?s=20




Updated : 13 Jan 2024 3:24 PM IST
Tags:    
Next Story
Share it
Top