Shanmukh : లవ్ బ్రేకప్.. షణ్ముక్ సూసైడ్ అందుకేనా?
X
షణ్ముక్ జస్వంత్..సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. అప్పుడెప్పుడో కవర్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయ్యి ఆ తర్వాత బిగ్ బాస్‌తో మరింత పాపులర్ అయ్యాడు షన్ను. అయితే ఇప్పుడు మాత్రం గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి వార్తల్లో నిలిచాడు. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చాడు. షన్ను అన్న సంపత్ వినయ్‌పై ఓ యువతి కేసు పెట్టింది. ఆ కేసు ఇప్పుడు వెబ్ సిరీస్‌లాగా సాగుతోంది. షన్ను అన్న సంపత్ వినయ్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా షన్ను కూడా దొరికిపోయాడు.
షన్ను అన్న.. సంపత్ వినయ్‌ను అరెస్ట్ చేయడానికి ఆయన ఫ్లాట్‌కు పోలీసులు వెళ్లారు. అక్కడే మనోడు గంజాయి మత్తులో కనిపించాడు. గంజాయిని చూసిన పోలీసులు ఊరికే ఉంటారా. షన్నును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో షన్ను బోరున ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నా వినిపించుకోలేదు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని, అందుకే డ్రగ్స్ తీసుకున్నానని చెప్పినా పట్టించుకోలేదు. ఆఖరికి షన్ను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
షన్నుకు సూసైడ్ చేసుకోవాలనుకునేంతలా ఏమైంది? షన్ను జీవితం తెరచిన పుస్తకమే అని అందరికీ తెలుసు. యూట్యూబ్‌లో వైవా అనే షార్ట్ సిరీస్‌తో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అనేక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యాడు. ఇదంతా ఒక ట్రాక్. ఇక మరో ట్రాక్‌లో దీప్తి సునయనతో ప్రేమాయణం నడుపుతూ లవర్ బాయ్ అనిపించుకున్నాడు.
అయితే బిగ్ బాస్ తర్వాత షన్ను లైఫ్ ఒక్కసారిగా పడిపోయిందని పలువురు గుసగుసలాడుకున్నాడు. బిగ్ బాస్‌లోకి వెళ్లిన తర్వాత తన కో కంటెస్టెంట్ సిరి హన్మంత్‌తో క్లోజ్‌గా ఉన్నాడు. అదే షన్ను కొంపముంచింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరితో ఎఫైర్ ఉందని అనేక రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ వల్లే షన్నుతో సిరి మట్లాడ్డం మానేసిందని అప్పట్లో టాక్ నడిచింది. ఇక దీప్తి సునయన అయితే షన్నుకు బ్రేకప్ చెప్పడంతో ఆ కథ అక్కడితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు.
పెళ్లి చేసుకుంటారని అనుకున్న షన్ను, దీప్తిలు.. బిగ్ బాస్ తర్వాత విడిపోవడంతో షన్ను క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. ఈలోపు ట్రోలర్స్ గోల ఎక్కువైంది. అలాగే సిరితో రూమర్స్ పై నెట్టింట టాక్ బాగా వినిపించింది. షన్ను కత ఇక్కడితో అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ షన్ను మొదటికి వచ్చాడు. సాంగ్స్ చేస్తూ వెబ్ సిరీస్‌లో నటించడం మళ్లీ స్టార్ట్ చేశాడు. అయితే ఇన్నాళ్ల తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అందరికీ షాక్ ఇచ్చాడు.
దీప్తి బ్రేకప్ చెప్పినప్పటి నుంచీ షన్ను డిప్రెషన్‌లోనే ఉన్నాడా? లేక ఆ మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి డ్రగ్స్ కేసులో దొరికిపోయిన షన్నుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షన్ను మానసిక పరిస్థితి అస్సలు బాలేదని అనిపిస్తోంది. షన్ను ఫ్యాన్స్ మాత్రం దీప్తితో బ్రేకప్ వల్లే ఇలా అయిపోయాడని నోరుపారేసుకుంటున్నారు.
ఇకపోతే సోషల్ మీడియాలో షన్ను వీడియాలు వైరల్ అవడంపై సిరి రియాక్ట్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అతనితో మాట్లాడ్డం మానేశానని సిరి చెప్పింది. షన్నుతో రూమర్స్ వార్తలు తనను ఎంతగానో బాధపెట్టాయని, ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చింది. దీప్తి సునయనతో బ్రేకప్ అయిన తర్వాత అసలు షన్నుతో కలవడమే మానేసినట్లు చెప్పింది. కానీ షన్నును కలిసినా కలవకపోయినా అతను బావుండాలనే కోరుకుంటానని చెప్పింది. సిరి ఇప్పుడు బజర్దస్త్ షోలో బిజీగా ఉంది. ఇకపోతే షన్ను అభిమానులు మాత్రం దీప్తిని తిట్టిపోస్తున్నారు. దీప్తి నుంచి ఎటువంటి స్పందన లేదు. మొత్తానికి షన్ను పరిస్థితిని చూసి
'అరె ఏంట్రా ఇది' అని అంటున్నారు.