Home > సినిమా > డింపుల్ హయతికి అదిరిపోయే ఆఫర్..ఆ స్టార్ హీరోతో స్పెషల్ సాంగ్

డింపుల్ హయతికి అదిరిపోయే ఆఫర్..ఆ స్టార్ హీరోతో స్పెషల్ సాంగ్

డింపుల్ హయతికి అదిరిపోయే ఆఫర్..ఆ స్టార్ హీరోతో స్పెషల్ సాంగ్
X

టాలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయతి లక్కీ ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్‎గా ఈ భామ నటించిన ఖిలాడీ, రామబాణం సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో భామ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. అయితే లేటెస్టుగా డింపుల్‎కు భారీ ప్రెజెక్ట్‎లో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. శంకర్ డైరెక్షన్‎లో వస్తున్న ఇండియన్ 2లో భామ స్పెషల్ సాంగ్ తో దుమ్ము దులిపేసేందుకు రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది.





స్టార్ హీరో కమల్‌ హాసన్‌, డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‎లో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్‌ 2. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‎లతో పాటు బాబీ సింహా, సముద్రఖని వంటి స్టార్లు ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్‎గా ఇండియన్ 2 తీస్తున్నారు శంకర్. 1996 లో విడుదలైన భారతీయుడు చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్‎ను సాధించింది. దీంతో ఇప్పుడు ఇండియన్ 2 సినిమాపైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో చిత్రబృందం ఓ స్పెషల్ సాంగ్ కోసం డింపుల్ హయతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయంపై అనౌన్స్‎మెంట్ రావాల్సి ఉంది.





ఇండియన్ 2 చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. కమల్‌ హాసన్‌ తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. త్వరలోనే చిత్ర బృందం సినిమా టీజర్‌‎ను విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కమల్ హాసన్ నట విశ్వరూపాన్ని మరోసారి తెరమీద చూసేందుకు ఆయన ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.










Updated : 22 Jun 2023 9:32 AM IST
Tags:    
Next Story
Share it
Top