Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ ఎలా ఉంది
X
మా ఊరి పొలిమేర.. 2021లో విడుదలైన సినిమా. అప్పట్లో థియేటర్స్ లో కాక ఓటిటిలో వచ్చిందీ సినిమా. స్టార్ కాస్ట్ లేకపోవడంతో చాలామంది మొదట లైట్ తీసుకున్నారు. కానీ రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ వల్ల హిట్ టాక్ తెచ్చుకుందీ సినిమా. ఫస్ట్ పార్ట్ లోని ట్విస్ట్ లు చాలామందిని ఆకట్టుకున్నాయి. చేతబడి కాన్సెప్ట్ తో డిఫరెంట్ అటెంప్ట్ లా అనిపించిన ఈ మూవీలో సత్యం రాజేష్, కామాక్షిభాస్కర్, బాలాదిత్య, గెటప్ శ్రీను, రవివర్మ కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ పార్ట్ లోనే సీక్వెల్ కు అద్భుతమైన లీడ్ వదిలాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. అప్పటి నుంచీ ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా చూస్తున్నారు ఆడియన్స్. వారి కోసమే ఈ సారి మరింత బెటర్ బడ్జెట్ తో సెకండ్ పార్ట్ రెడీ అయింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర2 టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు. బట్ ట్రైలర్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేదు. చూస్తే ఇది సీక్వెల్ లా కాకుండా మరో కొత్త కథలా కనిపిస్తోంది. అనేక రహస్యాలున్న ఓ శాపగ్రస్త గుడి చుట్టూ ఈ సారి కథ తిరగబోతోందని అర్థం అవుతుంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కు అనుగుణంగా ఆ హీరోయిన్ తో పాటు ఆల్రెడీ ఉన్న హీరోయిన్ కూడా కనిపిస్తోంది. ఇక చేతబడి తరహా కంటెంట్ ఈ సారి మరింత పెద్ద డోస్ తో ఉండబోతోందని అర్థం అవుతోంది. ఎవరూ వెళ్లడానికి సాహసించని గుడిలోకి సత్యం రాజేష్ వెళ్లడం.. తన ముందు ముగ్గు వేసుకుని పూజలు చేస్తుండగా.. వందల పాములు అతనికి ఎదురుగా.. ఉండటం గగుర్పొడిచే సీన్ లా ఉంటుందేమో.
ఇక సత్యం రాజేశ్ తో పాటు ఫస్ట్ పార్ట్ లోని వారు మరోసారి అదే పాత్రలో ఉన్నారు. ఆ కారణంతో సీక్వెల్ అంటున్నారా లేక కథ కూడా కంటిన్యూ అవుతుందా అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఈ ట్రైలర్ తో ఇంప్రెస్ చేశారు. కానీ అచ్చంగా సీక్వెల్ కాదేమో అనిపిస్తోంది. ఈ సినిమాను బన్నీ వాస్ విడుదల చేయబోతున్నాడు. విషయం లేకుండా అతను ఇలాంటివి చేయడు. అందుకే మా ఊరి పొలిమేర2పై అంచనాలు పెట్టుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 3న అచ్చంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజునే విడుదల చేయబోతున్నారు.