Home > సినిమా > మహేశ్ బాబు సినిమా కంటే ముందే జక్కన్న మరో కొత్త సినిమా

మహేశ్ బాబు సినిమా కంటే ముందే జక్కన్న మరో కొత్త సినిమా

మహేశ్ బాబు సినిమా కంటే ముందే జక్కన్న మరో కొత్త సినిమా
X

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలకు తెలియజేసిన జక్కన్న.. తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. అయితే ఈ కొత్త సినిమాకు ఆయన దర్శకుడు కాదు. కేవలం సమర్పకుడు. తన కొడుకుని ఈ సినిమాతో నిర్మాతగా మార్చాడు. రాజమౌళి సమర్పణలో ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీ మీద రాజమౌళి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. మేడ్ ఇన్ ఇండియా అంటూ ఈ సినిమా రాబోతోందంటూ రాజమౌళి ట్వీట్ వేశాడు.





ఆర్ఆర్ఆర్ తరువాత.. రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే జక్కన్న... అసలు ఇండియన్‌ సినిమా ఎక్కడ పుట్టింది. దానికి మూలం ఏంటి అనే కథతో ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ (Made In India) అనే సినిమాను సమర్పిస్తున్నారు. ఇండియాన్ సినిమా బయోపిక్‌ గా చెప్పకుంటున్న ఈ సినిమాకు నితిన్‌ కక్కర్‌ దర్శకుడు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలుపుతూ.. ‘‘ఈ కథ విన్నవెంటనే నేను భావోద్వేగానికి గురయ్యాను. బయోపిక్‌లను రూపొందించడం చాలా కష్టం. అలాంటిది ఫాద‌ర్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా బ‌యోపిక్ తీసి ప్రేక్ష‌కుల్ని క‌న్వీన్స్ చేయ‌డం మరింత సవాళ్లలో కూడుకున్నది. ఆ ఛాలెంజ్‌ను స్వీక‌రించ‌డానికి మా బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సినిమాను సమర్పిస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’’ అని అన్నారు.





ఫాద‌ర్ ఆఫ్ ఇండియ‌న్ సినిమాగా పేరుతెచ్చుకున్న దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా మేడిన్ ఇండియా సినిమా రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. ఇండియన్ సినిమా పుట్టుక, ఎదుగుదల ఇందులో చూపించనున్నారు. మొత్తం 6 భాషల్లో ఈ చిత్రం రానుంది. రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడంటే.. ఆ కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇలా అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. రాజమౌళి సలహాలు తీసుకుని ఉంటారు. ఈ ప్రాజెక్ట్ మీద రాజమౌళి కూడా టైం వెచ్చించి ఉంటాడు.




Updated : 19 Sept 2023 12:11 PM IST
Tags:    
Next Story
Share it
Top