Home > సినిమా > Bigg boss7: బిగ్బాస్లో సామాన్యులను పెడితే ఎవడు దేకడు: నటి

Bigg boss7: బిగ్బాస్లో సామాన్యులను పెడితే ఎవడు దేకడు: నటి

Bigg boss7: బిగ్బాస్లో సామాన్యులను పెడితే ఎవడు దేకడు: నటి
X

నచ్చావులే సినిమా ద్వారా ఆడియన్స్ కు పరిచయం అయిన బ్యూటీ మాధవీలత. సినిమాలకు గ్యాప్ వచ్చిన తర్వాత ఈవిడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. రాజకీయాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ కు కూడా గట్టి రెస్పాన్స్ ఇస్తూ.. తనను మాటలు అనేవాళ్లు నోటిన వేళు వేసుకునేలా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బిగ్ బాస్ షోను కూడా వదిలిపెట్టలేదు. బిగ్ బాస్ 2లో అవకాశం వచ్చినా తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో చాన్స్ మిస్ చేసుకుంది. అలాంటి మాధవీలత ఇప్పుడు బిగ్ బాస్ ను ట్రోల్ చేయడంపై అందరిలో ఆసక్తి నెలకొంది.





తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఓ అభిమాని బిగ్ బాస్ చూస్తున్నారా..? అని అడిగినందుకు ఓ రేంజ్ లో సమాధానం ఇచ్చింది. ‘బిగ్ బాస్ 100 శాతం కమర్శియల్ షో. అందులో సామాన్యులను తీసుకోవాలి అనేది సోది టాపిక్. సామాన్యులను పెడితే ఎవడు దేకడు. టీఆర్పీ రాదు. సో.. పిచ్చి ఆలోచనలు మానేసి చూసేవాళ్లు చూడండి అంతే. ఎవడ్ని పెడితే దేకుతరో వాళ్లనే పెడ్తారు. ఈ సీజన్ కు చాలామంది ట్రై చేశారు. మీ పైసలు వద్దు, మీ పబ్లిసిటీ వద్దు. మాకు ఇజ్జతి ముఖ్యం అంటూ చాలామంది టాటా బై బై చెప్పారు. సో.. ఉన్నవాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆవిడ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మాధవీలత చేసిన కామెంట్స్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను అన్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ ను కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు ఓట్ వేసి మద్దతు తెలుపుతున్నారు.






Updated : 17 Sept 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top