Home > సినిమా > 'జైలర్‌' రిలీజ్‌ రోజు... ఉద్యోగులకు సెలవు

'జైలర్‌' రిలీజ్‌ రోజు... ఉద్యోగులకు సెలవు

జైలర్‌ రిలీజ్‌ రోజు... ఉద్యోగులకు సెలవు
X

సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న స్పెషల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులనే ఆయన భక్తులు ఎప్పుడెప్పుడు తన ఫేవరేట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. తలైవా నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఈ వారం తలైవా నటించిన సినిమా 'జైలర్'(Jailer Movie) రిలీజ్ కానుంది. ఈ నెల 10న గురువారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. అంతేకాదు.. అందులో పనిచేస్తున్న వారందరికీ ఉచితంగా జైలర్ మూవీ టికెట్స్ ను ఇవ్వనుంది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లన్నీటికి అధికారికంగా సెలవు ప్రకటించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఇక నెల్సన్‌ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్న హీరోయిన్‌గా కనిపించనుంది. రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ మూవీ కోసం తెలుగు అడియెన్స్ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ వచ్చిన తర్వాత రోజే మెగాస్టార్ కూడా రానున్నాడు. భోళాశంకర్ తో చిరంజీవి ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీపడి చాలా ఏళ్లే అయింది. మరి ఈ రేసులో ఎవరో విజయం సాధిస్తారో తెలుసుకోవాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే.


Updated : 7 Aug 2023 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top