Home > సినిమా > పుట్టబోయే బిడ్డ కోసం పూజలు చేయండి.. మెగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..

పుట్టబోయే బిడ్డ కోసం పూజలు చేయండి.. మెగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..

పుట్టబోయే బిడ్డ కోసం పూజలు చేయండి.. మెగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా..
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మంగళవారం బిడ్డ పుట్టబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయని, రేపే కొత్త మెంబర్ వస్తున్నారని పోస్టులతో మెగా అభిమానులు హోరెత్తిస్తున్నారు. పెళ్లై దాదాపు పదేండ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా ఫ్యాన్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెగా అభిమాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ వైరల్





అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ట్విట్టర్లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్ చరణం ఉపాసన దంపతుల బిడ్డ పేరు మీద మెగా అభిమానులు మంగళవారం జూన్ 20న దగ్గరలోని దేవాలయాల్లో పూజలు అర్చనలు చేయాలన్న ఈ పోస్టును కొందరు రీట్వీట్ చేయడంతో పాటు కామెంట్ల రూపంలో తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం మరీ ఇంత అభిమానమేంట్రా బాబు అని అంటున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే..

పూజలు, అర్చనలు

మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు శ్రీకారం. ఆ చిరంజీవి చిరు చిరు మురిపాలకు ఇదే ఆరంభం.. కావాలి రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డకు దేవ దేవుళ్ల ఆశీర్వాదం. అభిమానులై మనం చేసుకోవాలి అంబరాన్నంటే సంబరం. రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డ పేరు మీద మెగాభిమానులు జూన్ 20 మంగళవారం ఉదయం సమీపంలోని దేవాలయాల్లో పూజ, అర్చనలు చేయాలని కోరుకుంటున్నాను. అంటూ రవణం స్వామినాయుడు ఓ పోస్టర్ పోస్ట్ చేశారు.





కాలభైరవ గిఫ్ట్

ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు కాలభైరవ ఒక అందమైన ట్యూన్‌ను క్రియేట్ చేశాడు. చంటిపిల్లలు ఈ ట్యూన్ విని ఆనందంతో చిరునవ్వులు చిందించేలా ఆహ్లాదకరంగా ఉన్న ఆ ట్యూన్ ను రామ్ చరణ్ దంపతులకు గిఫ్ట్ గా ఇచ్చాడు. తమ బిడ్డ కోసం ఇంత మంచి ట్యూన్ అందించినందుకు కాలభైరవకు కృతజ్ఞతలు తెలుపుతూ రామ్ చరణ్, ఉపాసన ట్వీట్ చేశారు.




Updated : 19 Jun 2023 8:52 PM IST
Tags:    
Next Story
Share it
Top